ఇలియానా ఊపేసిందంతే

ఇలియానా ఈజ్‌ బ్యాక్‌.. చిన్న గ్యాప్‌ ఇచ్చినా మళ్ళీ దూకుడు పెంచేసింది బాలీవుడ్‌లో. ప్రస్తుతం ఇలియానా ఖాతాలో రెండు సినిమాలున్నాయి. వాటిల్లో ఒకటి 'బాద్‌షాహో' అయితే, ఇంకోటి 'ముబారకన్‌'. వీటిల్లో 'బాద్‌షాహో'కి సంబంధించిన ప్రోమో ఇప్పటికే బయటకు వచ్చింది.

లేటెస్ట్‌గా 'ముబారకన్‌' సినిమా టైటిల్‌ సాంగ్‌ ప్రోమోని విడుదల చేశారు. షరామామూలుగానే ఇలియానా ఓ ఊపు ఊపేసింది ఈ పాటలో. 

అనిల్‌కపూర్‌, అర్జున్‌కపూర్‌, అథియాశెట్టి (బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టి కుమార్తె), ఇలియానా తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. టైటిల్‌ ట్రాక్‌లో ఇలియానా గ్లామర్‌ ముందు అథియా పూర్తిగా తేలిపోయింది. ఇలియానా సాధారణంగానే ఇలాంటి పాటల్లో రెచ్చిపోతుంటుంది.

ఆమెకు వేసిన కాస్ట్యూమ్స్‌, ఆమెకోసం స్పెషల్‌గా డిజైన్‌ చేసిన డాన్స్‌ మూమెంట్స్‌.. అన్నీ అదిరిపోయాయనడం అతిశయోక్తి కాదేమో. 

అటు 'బాద్‌షాహో', ఇటు 'ముబారకన్‌'.. ఈ రెండూ తన కెరీర్‌కి వెరీ వెరీ స్పెషల్‌ మూవీస్‌ అంటోన్న ఇలియానా, 'ముబారకన్‌' సినిమాలో తన అల్ట్రా మోడ్రన్‌ లుక్‌కి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తుందని అంటోంది. నిజమే, సాంగ్‌ ప్రోమో తర్వాత ఇలియానా ఈజ్‌ బ్యాక్‌.. అనకుండా వుండలేరెవరూ.

Show comments