మెగాస్టార్‌ డాన్సులెలా వున్నాయ్‌.!

ఎట్టకేలకు చిరంజీవి తాజా చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150'కి సంబంధించి డాన్సింగ్‌ వీడియో ఒకటి వచ్చింది. టీజర్‌లో చిరంజీవి యాక్షన్‌ చూపించారుగానీ, డాన్సింగ్‌ మూమెంట్స్‌ ఒక్కటీ కన్పించలేదు. ఆడియో సింగిల్స్‌ పేరుతో ఒకటీ, రెండూ, మూడూ.. అంటూ 'అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు', 'సుందరి', 'యు అండ్‌ మి' ఆడియో సాంగ్స్‌ని వీడియో ఫార్మాట్‌లో విడుదల చేశారు. వాటిల్లో స్టిల్స్‌ తప్ప, వీడియో కన్పించలేదు. తాజాగా విడుదల చేసిన 'రత్తాలు' మాత్రం మెగాస్టార్‌ డాన్సులేస్తున్న విజువల్స్‌ చూపించడంతో.. ఇన్నాళ్ళ అభిమానుల నిరాశకు కాస్త తెరపడిందని చెప్పక తప్పదు. 

'అమ్మడు కుమ్ముడు' మేకింగ్‌లోనూ ఈ స్థాయిలో చిరంజీవి డాన్సింగ్‌ మూమెంట్స్‌ కన్పించకపోవడం గమనార్హం. ఎలాగైతేనేం, 'రత్తాలు' సాంగ్‌తో మెగాస్టార్‌ డాన్సులకు సంబంధించి 'టీజర్‌' విడుదల చేశారనుకోవాలి. 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాకి సంబంధించినంతవరకు ఈ 'రత్తాలు' ఐటమ్‌ సాంగ్‌ మీద చాలా ఫోకస్‌ పెట్టారు. చిరంజీవి ఆస్థాన కొరియోగ్రాపర్‌ లారెన్స్‌ ఈ సాంగ్‌కి నృత్యదర్శకత్వం వహించిన విషయం విదితమే. 

చిరంజీవి డాన్సులు అదిరిపోయాయంటూ అప్పుడే అభిమానులు సందడి చేసేస్తున్నారు. చాన్నాళ్ళ తర్వాత చిరంజీవి తెరపై డాన్సులేయనుండడంతో.. మునుపటి ఎనర్జీ కోసం ఆయన తీవ్రంగానే శ్రమించి వుండాలి. ఆ ఈజ్‌తోనే ఆయన డాన్సులు చేశారన్న విషయం 'రత్తాలు' సాంగ్‌లో చూపించిన కొద్దిపాటి విజువల్స్‌తోనే అర్థమవుతోంది. వున్నంతలో మెగాస్టార్‌ స్టెప్పులు అదరగొట్టేశారనే వాదన సర్వత్రా విన్పిస్తోంది. 

అయితే, పూర్తి స్థాయిలో విజువల్స్‌లో ఆ మూమెంట్స్‌ని చూపించకుండా జాగ్రత్తపడింది 'ఖైదీ నెంబర్‌ 150' టీమ్‌. ముందు ముందు సాంగ్‌ టీజర్స్‌ని కూడా ఆడియో సింగిల్స్‌ తరహాలో విడుదల చేయడం ద్వారా, రిలీజ్‌ నాటికి హైప్‌ని ఇంకా ఇంకా పెంచెయ్యాలన్నది నిర్మాత రామ్‌చరణ్‌ వ్యూహం కావొచ్చు. జనవరి 4న 'ఖైదీ' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జరగనున్న దరిమిలా, ఇంకా విడుదల కావాల్సి వున్న ట్రైలర్‌లో ఇంకెలాంటి విశేషాలు వుంటాయో వేచి చూడాల్సిందే. Readmore!

Show comments

Related Stories :