సంక్రాంతి బరిలోకి ఆ సినిమా కూడా

ఇప్పటికే రెండు భారీ సినిమాలు, ఓ క్లాస్ సినిమా సంక్రాంతి బరిలోకి దూకడానికి రెడీ అయిపొయాయి. ఖైదీ నెం 150, గౌతమీ పుత్ర శాతకర్ణి, శతమానం భవితి సినిమాలకు తోడుగా ఆర్ నారాయణమూర్తి, జయసుధ జంటగా నటిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య కూడా అప్పుడే విడుదలవుతుందట. ఈ మేరకు అప్పుడే అధికారికంగా ప్రకటించేసారు. 

ఆర్ నారాయణమూర్తి సినిమాలంటే సి సెంటర్లలో కాస్తో కూస్తో క్రేజ్ వుంటుంది. ముఖ్యంగా నైజాంలో ఆర్ నారాయణమూర్తి సినిమాలు చూసే ప్రేక్షకులు వున్నాయి. అయితే ఇది ఎర్రజెండా సినిమా కాదు. ఓ సగటు పోలీసు సినిమా. అయితే జయసుధ ఈ సినిమాలో ప్రధానపాత్ర పోషించడం, నారాయణమూర్తి వుండడం వల్ల సి సెంటర్లలో కాస్త ఆదరణ వుంటుందేమో ?

 లేదూ అన్నీ బాగుండి, డబ్బులు జనాల దగ్గర దండింగా వుంటే, రిటర్న్ క్రౌడ్స్ కు ఆఫ్షనల్ గా పనిచేస్తుంది.

Readmore!
Show comments