కొమ్మినేని: కుల సుద్దులు-ఆశ్చర్యమే!

రాజకీయాలు ఎలా మారిపోతాయి? ఒకప్పుడు అనంత పురం జిల్లాలో రాజకీయాలకు, ఇప్పటి రాజకీయాలకు ఎంత మార్పు వచ్చిందో చూడండి. 1989-94 మధ్యలో ప్రస్తుత తెలుగుదేశ ఎంపి జేసీ దివాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ మంత్రిగా ఉండేవారు. అప్పట్లో టీడీపీకి, ఆయనకు మధ్య ఉప్పు, నిప్పుగా ఉండేది. స్వయంగా ఎన్‌.టీ.ఆర్‌. నేత త్వంలో ఆయనకు వ్యతిరేకంగా ధర్మవరంలో ధర్నా జరి గింది. ఆ తర్వాత ఎన్‌.టీి.రామారావు ముఖ్యమంత్రి అయ్యాక ఆనాటి మంత్రి పరిటాల రవి దెబ్బకు తాడిపత్రి లో జేసీ సోదరులు మున్సిపల్‌ ఎన్నికలలోనే పోటీచేయడానికి భయపడ్డారు. అక్కడ పార్టీ పోరు, కులం పోరు నిత్యం సాగేవి. 

విభజన తర్వాత కాంగ్రెస్‌ నుంచి అనూ హ్యంగా జేసీ సోదరులు టీడీపీలోకి వచ్చారు. దివాకర్‌రెడ్డి టీడీపీ ఎంపి అయితే, ప్రభాకరరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అయ్యారు. తాడిపత్రిలో వారిదే సామ్రాజ్యం అయినా జిల్లాలో పెత్తనం మాత్రం దక్కలేదు.దాంతో అప్పుడప్పుడు జేసీ వ్యూహాత్మక ప్రకటనలు ఇస్తుంటారు. వాటిలో ముఖ్య మంత్రి చంద్రబాబుపైన, టీడీపీపైన కూడా వ్యాఖ్యలు ఉం టాయి. దానిపై చంద్రబాబు కూడా క్లాస్‌ తీసుకుంటుం టారు. ఆ తర్వాత మళ్లీ స్వరం మారుతుంటుంది. ఇవన్నీ ఒకఎత్తు అయితే తాజాగా జేసీ దివాకర్‌రెడ్డి చెప్పిన సుద్దు లు మరో ఎత్తు అనుకోవాలి.?ఎన్నికలలో కులం, మతం, ప్రాంతం, భాష వంటి అంశాలను ప్రచారం చేయవద్దని, రాజకీయనాయకులు వాటిని వాడవద్దని సుప్రీంకోర్టు చెప్పిన కొద్ది గంటలలోనే జేసీ దివాకర్‌రెడ్డి కులం గురిం చి మాట్లాడడమే కాదు. రెడ్లు విపక్ష నేత జగన్‌కు ఎం దుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. 

జేసీ దివాకర్‌రెడ్డి ఎప్పుడూ తెలివిగా వాలు ఈత చేస్తుంటారు. కాంగ్రెస్‌లో ఉన్నా అధికారవర్గంలోనే ఉండడానికి యత్ని స్తారు. విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నవారితో సత్సంబంధాలు నడపడానికి వ్యూహాత్మకంగా వ్యవహరి స్తుంటారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు కూడా ఆయనను నేరుగా కలవగలిగిన అతి కొద్ది మంది ఎమ్మెల్యేలలో జేసీ ఒకరుగా ఉండేవారు. అందుకే చంద్రబాబును తమ మేనమామ అని అంటుండేవారు. ఒకసారి టీడీపీనేత పరిటాల రవి తదితరులు చంద్రబాబు ఆఫీస్‌ వద్ద ఎదురు చూస్తుంటే జేసీ రావడం, నేరుగా చంద్రబాబును కలవడం, వెళ్లిపోవడం చూసి వీరంతా ఆశ్చర్యపోవలసి వచ్చింది. ఆ తర్వాత వైఎస్‌తో సఖ్యత ఏర్పడి ఆయన అధికారంలోకి వచ్చాక ఈయన మంత్రి అయ్యారు. అప్పుడు ఒక ఘటన జరిగింది. అంతకు ముందు చంద్రబాబు భారీ నీటి పారుదల స్కీములన్నిటిని నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శ తీవ్రంగా ఉండేది. అధి కారులు భారీ ఎత్తున నీటి పథకాలు చేపట్టడం గురించి అనేక ప్రతిపాదనలు వైఎస్‌ కేబినెట్‌ ముందు ఉంచారు. అప్పుడు మరి ఈ ప్రతిపాదనలు ఎందుకు చంద్రబాబుకు ఇవ్వలేదని జేసీ అడిగారట. దానికి తాము ఇచ్చామని చంద్రబాబు వాటిని పట్టించుకోలేదని చెప్పారట. ఈ విషయం స్వయంగా జేసీనే ఆరోజులలో చెప్పారు. 

మరి ఇప్పుడు అభివద్ధి అంతా చంద్రబాబుతోనే జరుగుతుం దని అంటున్నారు. అంతేకాక రెడ్లు ఎందుకు ఫలానా పార్టీకి మద్దతు ఇస్తున్నారని అది మంచిది కాదని ఆయన అంటున్నారు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. కులాన్ని తమ రాజకీయ అవసరాలకు వాడుకోవడంలో నేర్పరులైన వారు ఇలాగే మాట్లాడుతారేమో! జేసీ దివాకర్‌రెడ్డికి, అనంతపురం జిల్లాలోని అప్పటి ఎంపి దరూరు పుల్ల య్యకు కాంగ్రెస్‌లో వర్గ విబేధాలు ఉండేవి. ఇదే జేసీ వర్గం వారు కమ్మవారికి చెందిన తోటలను, అలాగే ప్రత్యర్థి వర్గానికి చెందినవారి తోటలను నరుకుతున్నారని పుల్లయ్య అనేక మందికి ఫిర్యాదు చేసేవారు. ఆయనే కాదు ప్రస్తుతం అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరికి, జేసీకి ఉన్న విబేధాలు ఇప్పటివి కాదు. చంద్రబాబు మెప్పు దల కోసం జేసీ మాట్లాడడం వినేవారికి కొంత చికాకు కలిగించినా జేసీ లక్ష్యం వేరు కావచ్చు. ఆయన అవస రాలు వేరు కావచ్చు. ఎంత తెలివైన నేత కాకపోతే పరి టాల రవి హత్య కేసులో తనపై ఆరోపణలు చేసిన టీడీపీ నేత, ప్రస్తుత మంత్రి పరిటాల సునీతతో రాజీ పడగలుగు తారు?

మరి అదే సమయంలో కమ్మవారిలో ఎక్కువ మంది టీడీపీకి, కాపులలో ఎక్కువ మంది పవన్‌ కళ్యాణ్‌కు మద్దతు ఇచ్చారన్న సంగతిని కూడా జేసీ ఎందుకు చెప్పలేదో తెలియదు. ఇంకో మాట కూడా గుర్తు చేసుకోవాలి. ఎన్నికల సమయంలో టీడీపీలోకి రావడా నికి కొన్నాళ్ల ముందు ఎంత తీవ్రంగా చంద్రబాబును విమర్శించిందీ జేసీ మర్చిపోయి ఉండవచ్చు. అంతేకాదు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి జేసీ సోదరులు చేరడానికి ప్రయ త్నించారన్న వార్తలు వచ్చిన విషయం ప్రజలు మర్చిపోయి ఉంటారని ఆయన భావన కావచ్చు. జేసీ రెడ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు శ్రవణానందంగా వింటూ ఆనందించారు.అది బాగానే ఉంది. కాని అదే సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఐజయ్య నీటి పారుదల పథకాలకోసం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన కషి చెప్పబోతే తాను ముఖ్యమంత్రి అన్న సంగతి, పార్టీలకు, వర్గాలకు అతీతంగా ఉండాలన్న సంగతి కూడా విస్మరించి ఆయనే అడ్డుపడడం గురించి ఏమనాలి?

 అది ప్రజాస్వా మ్యం, సంస్కారం అవుతుందా అన్నది ఎవరు చెప్పాలి. జేసీ దివాకరరెడ్డే కాదు. చంద్రబాబునాయుడు విద్యార్ధి రాజకీయ జీవితం కూడా  కులం ప్రాతిపదిక అనండి, పునాది అనండి ఆరంభమైందని ఆయన సమకాలీనులు చెబుతుంటారు. నిజమే! రాజకీయాలకు కులం ప్రాతి పదిక  మంచిది కాదు. అలాగే మోసాలు, వాగ్దాన బంగాలు మంచిది కాదు. కాని ఈ రెండిటిని ఆసరా చేసు కుని పదవుల నిచ్చెన ఎక్కిన పెద్దలు నీతులు వల్లిస్తుం టారు. మనం వింటుండాలి. అదే నేటి రాజకీయం.

Show comments