జగన్‌ - అఖిలేశ్‌ స్నేహం

ఉత్తరప్రదేశ్‌ లో విజయంవంతంగా తండ్రిపై తిరుగుబాటు చేసి పార్టీలో ఆధిపత్యం సంపాదించుకున్న అఖిలేశ్‌ యాదవ్‌ కూ కాంగ్రెస్‌ పై తిరుగుబాటు చేసి స్వంత పార్టీ పెట్టుకున్న జగన్మోహన్‌ రెడ్డికీ మధ్య సఖ్యత ఏర్పడినట్లు సమాచారం అందుతోంది. 

2019లో జాతీయ స్థాయిలో యువతరం కీలక ప్రాధాన్యత పోషించే క్రమంలో అఖిలేశ్‌, జగన్‌ భూమిక చెప్పుకోదగిన విధంగా ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలో  బిజెపియేతర రాజకీయాలు బలోపేతం అవుతున్న ద ష్ట్యా జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడుతుందని, అందులో అఖిలేశ్‌, జగన్‌ తో పాటు పలువురు ప్రముఖ పాత్ర పోషిస్తారని ఈవర్గం భావిస్తోంది.

గతంలో చంద్రబాబు యునైటెడ్‌ ఫ్రంట్‌ రాజకీయాల్లో కీలక పాత్రపోషించినట్లే ఇప్పుడు ఉత్తరాదినుంచి అఖిలేశ్‌, దక్షిణాది నుంచి జగన్‌ పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు.

Readmore!
Show comments

Related Stories :