బాబోయ్‌ ఐష్‌.. ఇదేం కెమిస్ట్రీ.!

'ఏ దిల్‌ హై ముష్కిల్‌' సినిమా తాజా మ్యూజిక్‌ వీడియో ప్రోమో బయటకు వచ్చింది. ఐశ్వర్యారాయ్‌, రణ్‌బీర్‌కపూర్‌, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమాకి ప్రధాన ఆకర్షణ ఐశ్వర్యారాయ్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మామూలుగా అయితే ఈ కాంబినేషన్‌లో రణ్‌బీర్‌, అనుష్కల మధ్య ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ గురించి అందరూ ఊహించుకుంటారు. కానీ, రొటీన్‌కి భిన్నంగా చిత్ర దర్శక నిర్మాతలు ప్లాన్‌ చేసినట్లున్నారు. 

ఐశ్వర్యారాయ్‌, రణ్‌బీర్‌కపూర్‌ ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ పండించడంలో రెచ్చిపోయారనే చెప్పాలి. ఎంతలా రెచ్చిపోయారంటే, ఇక్కడ ఐశ్వర్యారాయ్‌ తన వయసుని మర్చిపోయింది. ఆమె మాత్రమే కాదు, ప్రోమోలో ఆమెను చూస్తున్నంతసేపూ ఆమెకు 42 ఏళ్ళ వయసని తెలిసినాసరే చూసినవాళ్ళెవరైనా మర్చిపోవాల్సిందే. అంతలా కెమిస్ట్రీ అదరగొట్టేశారు ఐశ్వర్యారాయ్‌ - రణ్‌బీర్‌కపూర్‌. 

అక్టోబర్‌ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐష్‌, రణ్‌బీర్‌ల మధ్య ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ ఇంకా చాలానే వుందనీ, ప్రోమోలో కన్పించింది చాలా చాలా తక్కువేనని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ప్చ్‌.. ప్రస్తుతానికైతే అనుష్క ఫ్యాన్స్‌ కాస్త డీలా పడాల్సిందే. ఎందుకంటే, రణ్‌బీర్‌తో అనుష్కకి సంబంధించి ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ ఇప్పటిదాకా ఏమీ కన్పించలేదు మరి.! 

మిగతా విషయాలెలా వున్నా ఐశ్వర్యారాయ్‌ ఈజ్‌ బ్యాక్‌.. అన్పించేసింది. నలభై రెండేళ్ళ వయసులో.. ఇరవై రెండేళ్ళ బ్యూటీలా ఐశ్వర్యారాయ్‌ కన్పిస్తోంటే, ఆ కిక్కే వేరప్పా.!

Show comments