కాటమరాయుడికి రీప్లేస్‌మెంట్‌

పవన్‌కళ్యాణ్‌ హీరోగా 'కాటమరాయుడు' సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. 'అత్తారింటికి దారేది' సినిమాలో పవన్‌కళ్యాణ్‌ పాడిన 'కాటమరాయుడా.. కదిరి నరసింహుడా..' పాటలోని 'కాటమరాయుడు' సినిమాని టైటిల్‌గా చేసుకుని ముందే కమెడియన్‌ సప్తగిరి హీరోగా సినిమా ప్లాన్‌ చేశారు. అనూహ్యంగా ఈ టైటిల్‌ పవన్‌ చేతుల్లోకి వెళ్ళింది. స్వయంగా పవన్‌ అడగడంతో, సప్తగిరితో సినిమా ప్లాన్‌ చేసిన చిత్ర దర్శక నిర్మాతలు కాదనలేకపోయారు. 

ఈ విషయాన్ని స్వయంగా పవన్‌కళ్యాణ్‌, 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' సినిమా ఆడియో విడుదల వేడుకలో వెల్లడించారు. అదన్నమాట సంగతి, పవన్‌కళ్యాణ్‌ 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' సినిమా ఆడియో విడుదల వేడుకకు హాజరవడానికి కారణమిదే. తన సినిమాలకు సంబంధించిన ఆడియో ఫంక్షన్స్‌కి హాజరయ్యేందుకే పవన్‌ ఒకప్పుడు ఆసక్తి చూపించేవాడు కాదు. కానీ, ఈ మధ్య తన సినిమా ప్రమోషన్‌ కోసం పవన్‌ తనవంతు కష్టపడ్తున్నాడనుకోండి.. అది వేరే విషయం. 

'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' సినిమా తప్పకుండా చూస్తాననీ, సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాననీ పవన్‌కళ్యాణ్‌, 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' సినిమా ఆడియో విడుదల వేడుకలో చెప్పుకొచ్చాడు. నితిన్‌కి, పవన్‌ అంటే ఓ పెద్ద సెంటిమెంట్‌. ఏమో, 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' హిట్టయితే సప్తగిరికి కూడా పవన్‌ సెంటిమెంట్‌గా మారిపోతాడేమో.! 

అన్నట్టు, 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' సినిమాలో సప్తగిరి పోలీస్‌ గెటప్‌లో అతని డ్రెస్‌ మీద 'కాటమరాయుడు' అనే పేరుంటుంది. 

Show comments