చంద్రసిద్ధార్థ్ – రాక్‌లైన్ ల ‘ఆటగదరా శివా..!’

సందేశాత్మక చిత్రాల దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉన్న చంద్రసిద్ధార్థ్ నుంచి మరో సినిమా రూపొందుతోంది. దక్షిణాది భాషలన్నిటిలోనూ ముమ్మరంగా చిత్రాలు నిర్మిస్తున్న అగ్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాణంలో చంద్రసిద్ధార్థ్ ‘ఆటగదరా శివా!’ టైటిల్ తో సినిమా ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

తాత్విక చింతన, సామాజిక సందేశం చుట్టూ అల్లిన చక్కటి ఆకట్టుకునే కథతో నిర్మితమవుతున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరులో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా అంతా కొత్త నటీనటులతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. 

ఆ నలుగురు, అందరిబంధువయ వంటి మానవతా విలువలకు పెద్దపీట వేసే చిత్రాల దర్శకుడిగా చంద్రసిద్ధార్థ్ కు తెలుగు ప్రేక్షకుల్లో చెరగిపోని గుర్తింపు ఉంది. తాజాగా ఆయన చేయబోతున్న చిత్రం ‘ఆటగదరా శివా’ కూడా ఆ చిత్రాల కోవకే చెందేలా ఉంటుందని తెలుస్తోంది. నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ గతంలో తెలుగులో రవితేజతో పవర్ చిత్రాన్ని నిర్మించారు. రజనీకాంత్ లింగ నిర్మాతగా, సల్మాన్‌ఖాన్ భజరంగీ భాయీజాన్ సహనిర్మాతగా వ్యవహరించి.. అగ్రనిర్మాతల జాబితాలో చేరారు. ఆయన తెలుగులో తన రెండో చిత్రాన్ని దర్శకుడు చంద్రసిద్ధార్థ్ తో చేస్తున్నారు. 

Show comments