అరిగిపోయిన ట్రయిలర్ మళ్లీ వదిలారు

సాధారణంగా ఓ సినిమా అడియో ఫంక్షన్ జరగబోతోందంటే, సినిమా అభిమానులు ఆసక్తి కనబరుస్తారు. ఎందుకంటే..ఆ ఫంక్షన్ లోనే ఆ సినిమా థియేట్రికల్ ట్రయిలర్ విడుదల చేస్తారు కాబట్టి. ఆ సినిమా ఎలా వుండబోతోందన్న వైనాన్ని తెలుసుకోవచ్చు కాబట్టి. 

కానీ అదేం చిత్రమో, నాగ చైతన్య-గౌతమ్ మీనన్ సినిమా సాహసం శ్వాసగా సాగిపో సినిమా అడియో ఫంక్షన్ లో దాదాపు రెండు వారాల క్రితమే సోషల్ నెట్ వర్క్ లోకి వచ్చిన పాత ట్రయిలర్ నే మళ్లీ విడుదల చేసారు. ఇప్పటికే ఈ సినిమా చాలా అంటే చాలా ఆలస్యం అయింది. 

Click Here For Trailer

అయితే గౌతమ్ మీనన్ కాబట్టి కచ్చితంగా ప్రేక్షకులకు ఆసక్తి వుంది. గతంలో ఒకటికి రెండు టీజర్లు వదిలారు. రెండో టీజర్ లో చెప్పిన విషయాన్నే రెండు వారాల క్రితం విడుదలైన ట్రయిలర్ లో మరి కాస్త చెప్పారు. ఇప్పుడు అదే ట్రయిలర్ వదిలారు. మరి ప్రేక్షకులకు ఆసక్తి మరింత ఎలా పెరుగుతుంది? Readmore!

Show comments

Related Stories :