మజ్ఞులో రాజ్ తరుణ్ గెస్ట్ రోల్

విరించి వర్మ..ఉయ్యాల జంపాల సినిమాతో ఒక్కసారిగా తానేంటో నిరూపించుకున్నాడు. అంతే కాదు. ఇండస్ట్రీకి రాజ్ తరుణ్ అనే హీరోను అందించాడు. ఆ విరించి వర్మ ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాడు. నాని హీరోగా మజ్ఞు అంటూ. ఈ సినిమాలో తను మాంచి లాంచింగ్ ఇచ్చిన విరించి వర్మ కోసం ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడు రాజ్ తరుణ్.

ఆ పాత్ర వివరాలు ఇంకా తెలియవు కానీ, క్లయిమాక్స్ లో నే ఈ పాత్ర కనిపిస్తుందని తెలుస్తోంది. అంటే పెళ్లి పీటల మీద జస్ట్ పక్కకు తప్పుకునే పెళ్లి కొడుకు అలాంటి టైపు పాత్ర అన్నమాట. కేవలం విరించి వర్మ కోసం ఈపాత్రను చేయడానికి రాజ్ తరుణ్ ఓకె అన్నాడని తెలుస్తోంది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

Show comments