వర్చ్యువల్ రియాల్టీలో మహేష్ టీజర్

టాలీవుడ్ కు ఏ పిచ్చి పడితే అదే. అదెంతవరకు అవసరం, ఎంత వరకు జనానికి చేరుతుంది అని చూడరు. త్రీడీ టెక్నాలజీ వచ్చిన కొత్తలో అంతే. చకచకా తామర తంపర మాదిరిగా సినిమాలు వచ్చేసాయి. ఆ తరువాత మరి అవుట్. అదో వేలంవెర్రి అంతే. ఇప్పుడు కొత్తగా వర్చ్యువల్ రియాలిటీ టెక్నాలజీ మీద పడ్డారు. ఇలాంటి టెక్నాలజీలోకి మార్చిన విడియోను చూడాలంటే, ప్రత్యేకమైన వీఆర్ బాక్స్ కావాలి. దాంట్లో ఫోన్ అమర్చి, దానిద్వారా ఆ విడియో ను చూసుకోవచ్చు. 

దానివల్ల 360 డిగ్రీల ఏంగిల్ వ్యూలో సినిమాను చూడడం సాధ్యమవుతుంది. అంటే ప్రతి విషయంలో డెప్త్ తెలుస్తుంది. ఇలా ఓ డబ్బాను కళ్లకు తగిలించుకుని చూడడం అన్నది కాస్త చికాకైన వ్యవహారం అందుకే ఎంతగా పుష్ చేస్తున్నా ఇది క్లిక్ కావడం లేదు.

బాహుబలి 2 సినిమాను ఏకంగా వర్చ్యువల్ రియాలిటీ టెక్నాలజీ లో కూడా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా వర్చ్యువల్ రియాలిటీ లో కన్వెర్ట్ చేయడానికి కేవలం బాహుబలి 2 కు చేస్తున్న ఖర్చు 25 కోట్లు. ఇది చూసి, సినిమా అంతా ఎలాగూ చేయలేం కనీసం టీజర్ లేదా ట్రయిలర్ ఇలా చేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన బయలు దేరింది టాలీవుడ్ లో. ఆ మధ్య హైపర్ ట్రయిలర్ ను వర్చ్యువల్ రియాలిటీలోకి కన్వెర్ట్ చేసారు. కానీ ఎవరికీ తెలియనే తెలియదు. 

ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏమిటంటే, మహేష్-మురగదాస్ కాంబినేషన్ లో తయారయ్యే సినిమా టీజర్ కూడా ఈ వర్చ్యువల్ రియాల్టీ టెక్నాలజీ లో విడుదల చేయడానికి వర్క్ స్టార్ట్ అయింది. పది సెకెండ్ల టీజర్ వుంటుంది. దీన్ని లాస్ ఏంజిల్స్ లోని ఓ కంపెనీ తయారుచేస్తుంది. టీజర్ ఇక్కడ ప్రత్యేకంగా షూట్ చేసి, ఎడిట్ చేసి, ఆర్ ఆర్ మిక్స్ చేసి పంపిస్తే, అక్కడ వాళ్లు కన్వెర్ట్ చేసి పంపిస్తారు. దీని కోసం లక్షల్లో ఖర్చు మాత్రం తప్పదు. కొన్నాళ్లు ఇదో మోజు కొనసాగుతుంది.  Readmore!

Show comments