ప్రధానిని పెళ్లికి పిలుస్తారట.. వస్తారా?!

ఒకవైపు అప్పుడే తెలుగుదేశం వాళ్లు గాలి జనార్ధన్ రెడ్డి కూతురు వివాహ ఖర్చు గురించి, అందులో జగన్ వాటా గురించి మాట్లాడుతున్నారు. కూతురు పెళ్లికి గాలి జనార్ధన్ రెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడని.. అదంతా అవినీతి సంపాదనే అని.. అందులో జగన్ వాటా కూడా ఉందని వీరు అంటున్నారు. మరి ఏదో పెళ్లి.. అని కూడా వదిలేసే పరిస్థితిలో లేరు తమ్ముళ్లు. ఆ అంశంలో కూడా జగన్ ను ఇన్ వాల్వ్ చేస్తూ మాట్లాడటం ద్వారా పీక్స్ కు వెళ్లిన తమ ఫ్రష్ట్రేషన్ తమ్ముళ్లు ప్రదర్శిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. పెళ్లి ఖర్చు గురించి గాలి కుటుంబీకులు క్లారిటీ ఇచ్చారు. పెళ్లి ఇన్విటేషన్ పై చర్చ జరిగే సరికి కొంతమంది చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. అత్యంత భారీగా ఖర్చు పెట్టడం ఏమీ లేదు.. అంటూ గాలి సోమశేఖర్ రెడ్డి, గాలి ఫ్యామిలీ సన్నిహితుడు ఎంపీ శ్రీరాములు వివరణ ఇచ్చుకున్నారు. 

ఈ సందర్భంగా వీరు ఆహ్వానితులు జాబితా గురించి కూడా మాట్లాడారు. బీజేపీ నేతలైన వీళ్లు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీని కూడా వివాహానికి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. మోడీతో సహా బీజేపీ కేంద్ర నాయకత్వంలోని ముఖ్య నేతలందరినీ ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా గాలి సోదరుల గాడ్ మదర్ సుష్మాస్వరాజ్ ను కూడా ఆహ్వానించారట. ఈ విధంగా ఈ ఆహ్వానితుల జాబితా చాలా పెద్దగానే ఉంది. 

మరి మోడీ ఈ కార్యక్రమానికి హాజరు అవుతాడా? అనేది ఆసక్తికరమైన అంశం. గాలి జనార్ధన్ రెడ్డి ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే.. రాకపోవచ్చనే అనుకోవాలి. అలాగే ఏపీకి చెందిన ప్రముఖులకు కూడా  ఆహ్వానాలు అందే అవకాశం ఉంది. వారిలో జగన్ , వెంకయ్య నాయుడు వంటి వాళ్లు కూడా ఉండవచ్చు.

ఇక్కడే తెలుగుదేశానికి సమస్య వస్తోంది.. ఈ పెళ్లికి జగన్ కుటుంబీకులు ఎవరు హాజరైనా, పెళ్లికి హాజరయ్యారు కాబట్టి గాలికి అక్రమాలు.. జగన్ కు వాటా ఉంది అనేయొచ్చు. కానీ.. బీజేపీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరైతే మాత్రం.. తెలుగుదేశం పార్టీ ఈ పెళ్లికి హాజరయ్యే వారి విషయంలో ఏమీ మాట్లాడలేకపోవచ్చు.

Show comments