హాట్‌ అండ్‌ స్పైసీ.. పిగ్గీ చాప్స్‌.!

పిగ్గీ చాప్స్‌.. అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ప్రియాంకా చోప్రా, ఇప్పుడు హాలీవుడ్‌ దిశగా పరుగులు పెడ్తోంది. టెలివిజన్‌ సిరీస్‌ 'క్వాంటికో'తో హాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించిన ప్రియాంకా చోప్రా, హాలీవుడ్‌ నుంచి వరుస ఆఫర్లు దక్కించుకుంటోందట. వచ్చే ఏడాది ఓ హాలీవుడ్‌ చిత్రంతో ప్రియాంకా చోప్రా హల్‌చల్‌ చేయనుంది. హాలీవుడ్‌ సినిమాలంటే, కాస్తంత 'హాట్‌నెస్‌' ఎక్కువే వుంటుందని స్వయంగా ప్రియాంకా చోప్రానే చెబుతుండడం గమనార్హం. 

హాలీవుడ్‌ సినిమాదాకా ఎందుకు.? 'క్వాంటికో-2'తో ప్రియాంకా చోప్రా సృష్టిస్తున్న హాట్‌ వేవ్స్‌ తక్కువేమీ కాదు కదా.! తాజా సీజన్‌లో ప్రియాంకా చోప్రా కో-స్టార్‌తో కలిసి ఇంటిమేంట్‌ సీన్స్‌లో దుమ్మురేపేసింది. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇదే విషయమై ప్రియాంకా చోప్రాని కదిలిస్తే, ఇంటిమేట్‌ సీన్స్‌లో వింతేముంది.? బాలీవుడ్‌లో ఇలాంటివి తక్కువేమన్నా వున్నాయా.? అని ప్రశ్నిస్తోందామె. 

అప్పుడే ఏముంది, ఇంకా ముందు ముందు చాలా వుంది.. అంటోన్న ప్రియాంకా చోప్రా, ఇంటిమేట్‌ సీన్స్‌లో నటించడం థ్రిల్లింగ్‌గా వుందనీ, హాలీవుడ్‌ తెరపై ఏ స్థాయి అందాల విందుకైనా తాను సిద్ధమేనని ప్రకటించేసింది. ఇంత ఓపెన్‌గా వుండడం వల్లేనేమో, ప్రియాంకా చోప్రా అతి తక్కువ కాలంలోనే 'క్వాంటికో'తో పాపులర్‌ అయిపోయింది.!

Show comments