వాళ్ళు లోపలికి.. ఆమె బయటకి.!

హీరోయిన్‌ భావన అతి త్వరలో తిరిగి షూటింగ్‌కి హాజరు కానుంది. ఓ సినిమా షూటింగ్‌ ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఆమెపై కొందరు లైంగిక వేధింపులకు పాల్పడ్డ విషయం విదితమే. ఈ ఘటనలో ఓ సినీ ప్రముఖుడి హస్తం వుందన్న ప్రచారం జరుగుతోంది. ఆ సినీ ప్రముఖుడికి సంబంధించి ప్రాథమిక సమాచారం అందుకున్న పోలీసులు, పూర్తిస్థాయిలో ఆధారాల సేకరణ తర్వాత అతన్ని సైతం అదుపులోకి తీసుకోనున్నారు. మరోపక్క, సదరు సినీ ప్రముఖుడు పోలీసులకు లొంగిపోయే ప్రయత్నాల్లో వున్నట్లు తెలుస్తోంది. 

మరోపక్క, లైంగిక వేధింపులకు గురైన భావన, 'ఈ పరిస్థితుల్లో నేను కెమెరా ముందుకు రాలేను..' అంటూ ఆవేదన వ్యక్తం చేయడంతో మొత్తంగా సినీ పరిశ్రమ ఆమెకు బాసటగా నిలిచింది. 'ఇలాంటి సందర్భాల్లోనే నిర్భయంగా మీడియా ముందుకు రావాలి.. తిరిగి వర్క్‌లో బిజీ అవ్వాలి..' అంటూ పలువురు హీరోయిన్లు ఆమెకు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతానికైతే మీడియా ముందుకు వచ్చే ఉద్దేశ్యం భావనకు లేదనీ, అయితే అతి త్వరలో ఆమె తిరిగి షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలున్నాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. 

ఇదిలా వుంటే, మొత్తం రెండున్నర గంటలపాటు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారట నిందితులు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, ఆ క్రూరత్వాన్ని ఫొటోలు తీయడం, వీడియోలు తీయడం ద్వారా ఆ తర్వాత ఆమెను బ్లాక్‌మెయిన్‌ చెయ్యాలనుకున్నారు నిందితులు. ఓ దశలో ఆమెపై డ్రగ్స్‌ ప్రయోగించేందుకు కూడా నిందితులు వెనుకాడలేదని తెలుస్తోంది. దర్యాప్తులో వెల్లడయిన వివరాల ఆధారంగా, ఈ మొత్తం వ్యవహారానికి వ్యూహరచన చేసిన నిందితుడ్ని వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి, మీడియా ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

అయితే, అసలు కుట్రధారి అరెస్టయ్యాకే భావన తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. Readmore!

Show comments

Related Stories :