ట్రయిలర్ లో ఏముంది మడత

ఇగో రెడ్డి అంట.. మోటుబావి గిలకంట.. బోన్లోకి వెళ్లి పులిని చూడాలంట.. చివరాఖరికి లెక్క సరిచేస్తారంట.. ఇదీ చుట్టాలబ్బాయి ట్రయిలర్ ముచ్చట. ట్రయిలర్ చివర్న థర్టీ ఇయర్స్ పృధ్వీ..రెడ్డి ఇగో రెడ్డి..భయ పెట్టాలన్నా, పుట్టించాలన్నా నేనే..నా మడత అంటూ డైలాగు పేల్చాడు..కానీ అది పేలలేదు. 

ఆ మాటకు వస్తే, పృధ్వీ ఎంట్రీకి బ్యాక్ గ్రవుండ్ లో ఈ పేటకు నేనే మేస్తిరి అంటూ సాంగేసినా, ఏ మాత్రం సింక్ కాలేదు. అసలు ఇంతకీ ట్రయిలర్ కటింగ్ ఎలా వుందంటే, పూర్వం రోజుల్లో కుట్టించుకునే ముక్కల చొక్కాల వుంది. అందర్నీ ఓసారి ఒక్కో డైలాగ్ తో పరిచయం చేసేసి, ఇదీ ట్రయిలర్ అనుకోమంటే ఏముంటుంది..మడత? రెండు హిట్ లు ఓ ఫ్లాప్ తో లెక్క తేడాగా వుంది దర్శకుడు వీరభద్రమ్ చౌదరిది. 

Watch Chuttalabbayi Trailer

సాయికుమార్ డైలాగ్ చెబుతుంటే ఏదో తేడాగా వినిపిస్తోంది. భాయ్ లాంటి డిజాస్టర్ తరువాత చౌదరి తీసిన సినిమా ట్రయిలర్ ఇంకా  మరింత బెటర్ గా వుంటే బాగుండేదేమో అన్న కామెంట్ లు అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరి ట్రయిలర్ కటింగ్ మడత సరిగ్గా లేకున్నా, సినిమా బాగానే ఎంటర్ టైన్ మెంట్ గా వుంటుందేమో? 

పృధ్వీ, ఆలీ, షకలకశంకర్, పోసాని ఇలా కమెడియన్ల జాబితా పెద్దదే వుంది కాబట్టి. చూడాలి..ఆది లక్ మాత్రమే కాదు, చౌదరి లక్ కూడా ఎలా వుందో? ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి..ఆది ఈ సినిమాలో కాస్త అందంగా కనిపిస్తున్నాడు గతంలో కన్నా. కొత్త హీరోయిన్ కూడా. 

Show comments