పెద్ద సినిమాలకు అడియో చాలా కీలకం. ఖైదీ నెంబర్ 150 కి దేవీశ్రీప్రసాద్ ఇచ్చిన అడియో విలువ ఎంత అన్నది లెక్క కట్టలేం. ఆ సినిమా విజయంలో దేవీ ఇచ్చిన పాటలు చాలా కీలకపాత్ర వహించాయి. డైరక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ అనూప్ కు మ్యూజికల్ గా పెద్ద హిట్ లు. అలా అలా అనూప్ ఈ రేంజ్ కు వచ్చాడు. అలాగే పూరి జగన్నాధ్ తో చేసిన టెంపర్, నాగ్ తో సోగ్గాడే చిన్ని నాయనా, వివి వినాయక్ తో చేసిన అఖిల్ కూడా మంచి నేమ్ నే తెచ్చాయి.
ఇన్ని సినిమాల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అవకాశం వచ్చింది. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని అనూప్ రూబెన్స్ పాడు చేసుకున్నాడు. ఈ సినిమా మ్యూజికల్ హిట్ అయితే, అనూప్ అటు దేవీకి కూడా ఓ మాంచి ఆల్టర్ నేటివ్ గా తయారయ్యేవాడు. కానీ కాటమరాయుడుకు మ్యూజిక్ నే పెద్ద మైనస్ గా మారిపోయింది.
ఇక మరి ఇప్పట్లో పెద్ద హీరోల సినిమాలు అనూప్ ను ఛూజ్ చేసుకోవడం కష్టమే. పైగా అనూప్ మిగిలిన విషయాల ఎలా వున్నా, పని ఫాస్ట్ గా జరగదని, ఫోన్ లు లిఫ్ట్ చేయరని ఇండస్ట్రీ టాక్. ఎవరు ఫోన్ చేసినా అనూప్ ఆన్సర్ చేయరని, అంటారు. కాటమరాయుడు అడియో కూడా బాగా లేట్ చేసారని తెలుస్తోంది. ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ సినిమాకు కూడా ముందుగా అనూప్ ను అనుకుని, అతను ఫోన్ లు ఆన్సర్ చేయకపోవడం, టైమ్ కు స్పందించకపోవడం చూసి, ఆఖరి నిమిషంలో మార్చేసుకున్నారని టాక్.
అనూప్ లాంటి యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరక్టర్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు మార్చుకుని, పెద్ద సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టి వర్క్ చేయకపోతే కష్టమే.