సినీ పరిశ్రమలో గాడ్ ఫాదర్ లేకపోతే నిలదొక్కుకోవడం కష్టమంటోంది తాప్సీ. గాడ్ ఫాదర్ లేకపోవడం కష్టమే తప్ప, అసాధ్యమైతే కాదని తనలాంటివాళ్ళెందరో నిరూపించారని తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఒకే రోజు తాప్సీ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అందులో ఒకటి 'రన్నింగ్ షాదీ డాట్ కామ్' కాగా, ఇంకోటి 'ఘాజీ'. ఈ రెండు సినిమాల రిలీజ్‌ల కోసం తాప్సీ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
'ఇండస్ట్రీలో నాకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరు.. అందుకేనేమో అభిమానులే నాకు గాడ్ ఫాదర్ లాంటివారయ్యారు.. ఇది నా అదృష్టం..' అని చెబుతోన్న తాప్సీ, గాడ్ ఫాదర్ లేకపోవడం మైనస్సేననీ, ఒక్క చిన్న పొరపాటు నిర్ణయం ఇండస్ట్రీలోంచి తనను గెంటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని వాపోయింది. అందుకే, చేసే ప్రతి సినిమా విషయంలోనూ చాలా జాగ్రత్తగా వుంటానని అంటోంది తాప్సీ.
గాడ్ ఫాదర్ అన్న భావన బాలీవుడ్‌లోనే ఎక్కువగా కన్పిస్తుందనీ, అదే సౌత్‌ని తీసుకుంటే.. ఇక్కడ సక్సెస్సే కొలమానం అనీ, ఎక్కువగా గ్లామరస్ పాత్రలే సౌత్‌లో హీరోయిన్లకు దక్కుతాయనీ తాప్సీ చెప్పుకొచ్చింది. సౌత్‌లో అయినా, బాలీవుడ్‌లో అయినా అభిమానులే తనకు 'గాడ్ పాదర్' అని మరోమారు స్పష్టం చేసేసింది సొట్టబుగ్గల సుందరి తాప్సీ.