ఇల్లీ బేబ్‌ 'బికినీ'.. అంతకు మించి..

ఇల్లీ బేబ్‌.. అదేనండీ ఇలియానా ఇప్పుడు బికినీ బేబ్‌ అయిపోయింది. సోషల్‌ మీడియాలో బికినీలతో హల్‌చల్‌ చేసేస్తోంది. అవకాశాలు రాబట్టుకోడానికి ఇదో దారి.. అన్నట్టుగా వుంది ఇలియానా తీరు. ఇదే విషయమై రకరకాల కామెంట్స్‌ విన్పిస్తున్న వేళ, ఇలియానా తన బికినీ స్టంట్‌పై స్పందించింది. 

సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు చేరువయ్యేందుకు మంచి ప్లాట్‌ఫామ్‌ దొరికిందంటోన్న ఇలియానా, ఆ వేదికని ఉపయోగించుకుని, అభిమానుల్ని అలరిస్తున్నాననీ, వారిని ఆనందింపజేస్తున్నాననీ, ఇదేదో పబ్లిసిటీ స్టంట్‌.. అనుకుంటే ఎలా.? అని ప్రశ్నించింది ఇలియానా. 'లీజర్‌గా వున్న టైమ్‌లో స్విమ్మింగ్‌ నాకు చాలా ఇష్టం.. సరదాగా అండర్‌ వాటర్‌ కమెరాతో తీసిన వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే అది వైరల్‌ అయ్యింది.. అనుకోకుండా జరిగిందిది..' అంటూ ఇలియానా వివరణ ఇచ్చుకుంది. 

కారణమేదైతేనేం, ఇల్లీ బేబ్‌ బికినీ స్టంట్‌ బాగానే వర్కవుట్‌ అయ్యింది. బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌ వస్తున్నాయి ఇలియానాకి. టాలీవుడ్‌ నుంచీ ఆఫర్స్‌ వస్తున్నా, ఇల్లీ బేబ్‌ మాత్రం తెలుగు సినిమాకి మొహం చాటేసేసిందట. అప్పుడే ఏమయ్యింది.? ఇంకా ముందు ముందు చాలా వుంది.. సోషల్‌ మీడియాని ఫుల్లుగా వాడేస్తానంటూ ముసి ముసి నవ్వులు నవ్వేసింది ఇలియానా. 'చాలా వుంది..' అన్న మాటల్లో అర్థమేంటట.? బికినీకి మించి.. అనుకోవాలేమో.!

Show comments