అలా బతికి బయటపడ్డాం: సన్నీలియోన్‌

గాల్లో దీపం లాంటి ప్రాణం.. ఆకాశయానంలో చిన్న పొరపాటు దొర్లినా అంతే సంగతులు.! ఆ అనుభవం పోర్న్‌స్టార్‌ టర్న్‌డ్‌ బాలీవుడ్‌ స్టార సన్నీలియోన్‌కి ఎదురయ్యింది. 'అత్యంత భయంకరమైన పరిస్థితి.. ఇంతకు ముందు జీవితంలో ఎప్పుడూ చూడని భయానక పరిస్థితి అది.. ఎలా బయటపడ్డామో కాస్సేపు అర్థం కాలేదు.. ఆ సమయంలో పైలెట్లు దేవుళ్ళలా అన్పించారు..' అంటూ సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేసింది సన్నీలియోన్‌. 

ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను సన్నీలియోన్‌, మరికొందరితో కలిసి ప్రత్యేక విమానంలో బయల్దేరింది. అయితే, దురదృష్టవశాత్తూ వీరు ప్రయాణిస్తున్న విమానం 'బ్యాడ్‌ వెదర్‌' కారణంగా ప్రమాదంలోకి నెట్టివేయబడింది. ఆ పరిస్థితుల్లో పైలట్లు చాకచక్యంగా వ్యవహరించారు. విమానంలో తీవ్రమైన కుదుపురావడంతో ప్రాణాలు కోల్పోయామనే భావన కలిగిందని సన్నీలియోన్‌ చెప్పుకొచ్చింది. 

సోషల్‌ మీడియాలో సన్నీలియోన్‌ ఈ అనుభూతుల్ని చెబుతోంటే, ఆమె అభిమానులు ఆమె పట్ల విపరీతమైన సానుభూతి తెలిపారు. అభిమానుల ఆశీస్సులు, పైలట్ల తెగింపు తమను ప్రాణాలతో కిందికి దించాయని సన్నీలియోన్‌ చెబుతోంది.

Show comments