ఆ నిర్మాతని కాటేసిందెవరో తెలుసా.!

బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ ఓ 'కాటు'కి గురయ్యారు. ఇది పాము కాటు కాదు.. అంతకన్నా ప్రమాదకరమైనది. అదే సెల్ఫీ కాటు. నిజమే, ఈ రోజుల్లో సెల్ఫీ అనేది ఓ మేనియా.. అంతకు మించి. ఫోన్‌లో ఫ్రీగా లభించే ఫీచర్‌ 'సెల్ఫీ'. దాన్నిప్పుడు ఓ 'పురుగు'లా భావిస్తున్నాడు కరణ్‌ జోహార్‌. సరదాగా సోషల్‌ మీడియాలో కరణ్‌ జోహార్‌, సెల్ఫీ గురించి ప్రస్తావించాడనుకోలేం... ఎందుకంటే, ఆ స్థాయిలో సోషల్‌ మీడియాలో సెల్ఫీ గురించి ఓ ఘాటైన పోస్ట్‌ ఆయన పెట్టాడు మరి.! 

సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్ళినా వారి అభిమానులు సెల్ఫీ పేరుతో సెలబ్రిటీల మీద పడిపోతున్నారు. దాంతో, సెలబ్రిటీలు తీవ్ర అసహనానికి గురవుతున్నమాట వాస్తవం. ఓ సందర్భంలో టాలీవుడ్‌ హీరో బాలకృష్ణ, ఈ సెల్ఫీ పిచ్చితో ఓ అభిమాని తన మీదకు వచ్చేస్తోంటే, ఒళ్ళు మండి ఆ ఫోన్‌ పగలగొట్టేశాడు కూడా.! చాలామంది సెలబ్రిటీలది ఇదే పరిస్థితి. 

ఇక, సెల్ఫీల కారణంగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు అన్నీ ఇన్నీ కావు. సెల్ఫీ తీసుకోవడమంటే ఆత్మహత్య చేసుకోవడమే.. అనేంతలా సెల్ఫీ మరణాలు తెరపైకొస్తున్నాయి. ఎత్తయిన ప్రదేశాలు, ప్రమాదకర ప్రాంతాలు.. సెల్ఫీలకు 'హాట్‌' స్పాట్స్‌గా మారిపోతున్నాయి. తద్వారా అవి డెత్‌ స్పాట్స్‌ అయిపోతున్నాయనుకోండి.. అది వేరే విషయం. 

అన్నట్టు, సెల్ఫీ ఎడిక్ట్స్‌కి రిహాబిలిటేషన్‌ సెంటర్‌ కావాలని కరణ్‌ జోహార్‌ ఎవర్ని ఉద్దేశించి అన్నాడు.? అంతలా కరణ్‌ జోహార్‌ని సెల్ఫీ పేరుతో ఈ మధ్యకాలంలో ఇబ్బంది పెట్టిందెవరు.? ఆ ఇబ్బంది పెట్టిన వ్యక్తి కూడా సెలబ్రిటీ ఎందుకు కాకూడదు.? ఏమో మరి, ఆయనకే తెలియాలి. సెల్ఫీ ఓ వ్యసనమంటూనే, ఆ వ్యసనానికి కరణ్ ఎలా బానిసయిపోయాడో ఫొటోలో చూస్తున్నాం కదా.. ముందు కరణ్ కూడా రిహాబిలిటేషన్ వెతుక్కుంటే మంచిదేమో.

Show comments