క్లాసిక్స్ ను ఎందుకో టచ్ చేయడం?

రీమిక్స్ అన్నదో ఐటమ్ సాంగ్ లా తయారువుతోంది రాను రాను. వారసులు అంతా వారి వారి పెద్దోళ్ల పాటలను తమ తమ సినిమాల్లో రీమిక్స్ చేయడం మామూలయింది. ఎన్టీఆర్ పాటలను బాలయ్యో, జూనియర్ నో, మెగా స్టార్ పాటలను చరణ్ నో, సాయి ధరమ్ నో, కృష్ణ పాటలను ఆయన అల్లుడో, ఇలా చాలా మంది చాలా చేసేసారు..చేస్తున్నారు. 

అయితే వీటితో సమస్య లేదు. ఎందుకంటే ఇవన్నీ హిట్ పాటలే తప్ప గొప్ప పాటలు కావు. జస్ట్ రెండు మూడు దశాబ్ధాల కిందటి పాటలు కాబట్టి ..జస్ట్ ఎంటర్ టైనింగ్ పాటలు మాత్రమే. అక్కినేని ఒక లైలా కోసం కూడా జస్ట్ ఓ హిట్ సాంగ్ అంతే. కానీ ఎఎన్ఆర్ దేవదాసులోని పాటలు అంటే అవి అల్లాటప్పా సాంగ్స్ కావు. అలనాటి అద్భుతమైన క్లాసిక్స్. ఆ ట్యూన్ లను ఇప్పుడు రీమిక్స్ పేరిట ఖూనీ చేస్తే, మాత్రం కచ్చితంగా ఆ పాటల అభిమానులు బాధపడతారు.

 ఎందుకంటే దేవదాసు సినిమాలో పల్లెకు పోదాం..పారును చూదాం పాటను ఎఎన్నార్ మనవడు సుశాంత్ తన 'ఆటాడుకుందాం రా' సినిమాలో రీమిక్స్ చేసారట. ఆనాటి ట్యూన్ ఇప్పటి తరానికి నచ్చే ఫాస్ట్ బీట్ కాదు. అందుకోసం కచ్చితంగా ఏదో ఒకటి చేసి, కొంతయినా మార్చాల్సిందే. ఇక్కడ కూడా సంగీత దర్శకుడు భయంభయంగా చేయాల్సి వుంటుంది. ఎందుకంటే ఎటువంటి విమర్శలు వస్తాయో అనే ఆలోచన వుంటుంది. 

ఇన్నింటి మధ్య అలాంటి పాటను రీమిక్స్ చేయడం అవసరమా? కావాలంటే ఎఎన్నార్ అద్భుతమైన డ్యూయట్ లు డెభైల్లో వచ్చినవి చాలా వున్నాయిగా..వాటిని వాడుకోవచ్చుగా..దేవదాస్ సాంగ్ నే దొరికిందా? Readmore!

Show comments