భాగమతి కోసం భారీ సెట్

భాగమతి. అనుష్క కథానాయికగా యువి క్రియేషన్స్ నిర్మించే సినిమా. కేవలం కథానాయికకే ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది. హీరో పాత్ర జస్ట్ కథ కోసమే అని వినికిడి. అందుకే కావచ్చు పెద్ద హీరోలను ఎవరినీ తీసుకోకుండా, ఆది పినిశెట్టిని తీసుకున్నారు. 

ఆ సంగతి అలా వుంచితే ఈ సినిమా కాంటెంపరరీ స్టోరీనే కానీ, భాగమతి కోట భవనం మాత్రం వుంటుందట. అందుకోసం భాగమతి కోట మోడల్ లో రియలిస్టిక్ గా ఓ సెట్ వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం గోల్కొండ నవాబుల కాలం నాటి సంప్రదాయ భవన నిర్మాణ శైలి, శిల్పకళను ప్రతిబింబించేలా ఓ అద్భుతమైన డిజైన్ ను ఆర్ట్ డైరక్టర్ రవీందర్ రూపొందించారని తెలుస్తోంది. 

ఈ మేరకు త్వరలో ఈ సెట్ నిర్మాణం ప్రారంభమవుతుంది. అశోక్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. అరుంధతి, రుద్రమదేవి తరువాత మళ్లీ అనుష్కకు ఆ రేంజ్ సినిమా అవుతుంది ఇది.

Readmore!
Show comments

Related Stories :