అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ రిలీజైంది. ఉగాది కానుకగా ప్రేక్షకులకు చైతూ నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు ఆ సినిమా నిర్మాత నాగార్జున. నిన్ననే చెప్పినట్టు రెండు ఫస్ట్ లుక్స్ రిలీజయ్యాయి. వీటిలో ఒకటి క్లాస్ లుక్ అయితే ఇంకోటి మాస్ లుక్.
సినిమా టైటిల్ కు తగ్గట్టు “రారండోయ్ వేడుక చూద్దాం” అంటూ నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ ఉన్న స్టిల్ రిలీజైంది. ఇందులో ట్రెడిషనల్ దుస్తుల్లో చై, రకుల్ అదరగొట్టేశారు. ఈ లుక్ ను దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఫైనల్ చేశాడు. ఇక రెండో ఫోటో పక్కా మాస్ లుక్ లో ఉంది. ఓ ఫైట్ సీక్వెన్స్ లో నాగచైతన్య పరుగెత్తుకుంటూ వచ్చే స్టిల్ అది. దీన్ని నాగార్జున సెలక్ట్ చేశారు.
నిజానికి ఈ రెండింటిలో ఒక లుక్ నే విడుదల చేయాలనుకున్నారు. కానీ ఏది రిలీజ్ చేయాలో తేల్చుకోలేక రెండూ విడుదల చేశారు.