బడా హీరోలు... మినిమం నెల రోజులు..

హీరోలంతా ఇప్పుడు భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ఏదో 2 వారాలు షూట్ చేసి రెస్ట్ తీసుకొని మళ్లీ మరో షెడ్యూల్ ప్రారంభించే రోజులు పోయాయి. ఏకంగా నెల రోజులు చొప్పున కాల్షీట్లు కేటాయిస్తున్నారు. బాలకృష్ణ, రామ్ చరణ్ లాంటి హీరోలంతా తమ కొత్త సినిమాలకు ఏకంగా 30రోజుల పాటు కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేస్తున్నారు.

ప్రస్తుతం పూరిజగన్నాధ్ తో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈమధ్యే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. ఏప్రిల్ 7 నుంచి లండన్ లో మరో షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ కోసం ఏకంగా నెల రోజులు లండన్ టూర్ ప్లాన్ చేశాడు బాలయ్య. అటు బాలకృష్ణ, ఇటు పూరి జగన్నాధ్.. ఇద్దరికీ నెల రోజుల టైం అంటే చాలా ఎక్కువ. మ్యాగ్జిమమ్ షూటింగ్ అక్కడే కానిచ్చేస్తారన్నమాట.

రామ్ చరణ్, రవితేజ కూడా తమ సినిమాలకు బల్క్ గా కాల్షీట్లు కేటాయించారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చేనెల నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభంకానున్న కొత్త సినిమా కోసం ఏకంగా 35 రోజులు కాల్షీట్లు ఇచ్చాడు రామ్ చరణ్. అటు రవితేజ కూడా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయాల్సిన రాజా ది గ్రేట్ సినిమా కోసం ఏకంగా నెల రోజులు టైం కేటాయించాడట. త్వరలోనే డార్జిలింగ్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

వీళ్లందరికంటే ముందే నాగార్జున పని మొదలుపెట్టాడు. ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది-2 సినిమా చేస్తున్న నాగార్జున.. ఆ మూవీకి సంబంధించి మేజర్ షూటింగ్ కంప్లీట్ అయ్యేంతవరకు కాల్షీట్లు కేటాయించాడు. ఇలా హీరోలంతా భారీ షెడ్యూల్స్ తో రఫ్ఫాడించేస్తున్నారు.

Show comments