నీరు.. రైతు కన్నీరు.. చూడరెవ్వరు..

తొమ్మిదేళ్ళ తర్వాత చిరంజీవి నటిస్తోన్న సినిమా.. దాంతో, సినిమాపై భారీ అంచనాలే కాదు, సినిమాలో చిరంజీవి ఇలా వుంటే బావుంటుందేమో.. అన్న అభిప్రాయాలూ చాలానే వున్నాయి. పైగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి నుంచి సాదా సీదా కమర్షియల్‌ సినిమాని, అందులో 'అమ్మడు కుమ్ముడు.. రత్తాలు బొత్తాలు' లాంటి పాటల్ని జీర్ణించుకోవడం కష్టమేనన్న వాదనలూ తెరపైకొచ్చాయి. 

ఎలాగైతేనేం, ఆడియో సింగిల్స్‌ యూ ట్యూబ్‌లో సంచలనాల మీద సంచలనాలు నమోదు చేస్తున్నాయనుకోండి.. అది వేరే విషయం. ఈ టైమ్‌లో 'ఖైదీ నెంబర్‌ 150' టీమ్‌ నుంచి మరో ఆడియో సింగిల్‌ బయటకొచ్చింది. ఈసారి, 'ఇది నిఖార్సయిన పాట..' అనే కాంప్లిమెంట్స్‌ అందుకే ఆడియో సింగిల్‌ని విడుదల చేశారు. 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాకి మాతృక తమిళ సినిమా 'కత్తి'. రైతుల సమస్యల చుట్టూనే ఈ సినిమా కథ సాగుతుంది. తాజాగా విడుదలైన పాట కూడా రైతుల మీదనే. 

'నీరు.. రైతు కన్నీరు.. చూడరెవ్వరు..' ఇలా సాగుతుంది ఈ పాట. సినిమాలో ఈ పాట సందర్భం, చిత్రీకరణ ఎలా వుంటాయోగానీ, దేశవ్యాప్తంగా రైతుల ఆవేదనకు అద్దంపట్టేలా సినిమా లిరిక్స్‌ వున్నాయన్నది నిర్వివాదాంశం. అందే సమయంలో, లిరిక్స్‌ని మ్యూజిక్‌ డామినేట్‌ చేయకుండా వుండడంతో, అందర్నీ ఆకట్టుకుంటుంది. పాట విడుదలైన రెండు గంటల్లోనే లక్ష వ్యూస్‌ దాటేసింది యూ ట్యూబ్‌లో.

Show comments