చైతూ టీజర్ రెడీ అవుతోంది

వరుసపెట్టి ఫస్ట్ లుక్ లు, టీజర్లు, టైటిల్ అండ్ రిలీజ్ అనౌన్స్ మెంట్లు వస్తున్నాయి. ఈ బాటలో యంగ్ హీరో నాగ్ చైతన్య లేటెస్ట్ మూవీ కూడా రెడీ అవుతోంది. కొత్త డైరక్టర్ తో సాయి కొర్రపాటి నిర్మాణంలో తయారవుతున్న నాగ్ చైతన్య సినిమా దాదాపు ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చేసింది. ఆగస్టులో విడుదలయ్యే ఈ సినిమాకు టైటిల్ డిస్కషన్ లో వుంది. ఓ డిఫరెంట్ టైటిల్ అనుకుంటున్నారు కానీ ఇంకా ఫైనల్ కాలేదు. అది ఫైనల్ అయితే టీజర్ బయటకు వచ్చేస్తుంది. టీజర్ కట్ చేసి, టైటిల్ కోసం వెయిట్ చేస్తున్నారట.

ఈ సినిమాలో చైతూ డ్రోన్స్ స్పెషలిస్ట్ గా కనిపిస్తాడు. రేవతి, రావు రమేష్ తల్లితండ్రులుగా నటిస్తున్నారు. వారి మరణంపై డిఫరెంట్ స్కెచ్ లతో, డ్రోన్ ల సాయంతో ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడన్నది కథాశంగా తెలుస్తోంది. డ్రోన్స్ వంటి సాంకేతిక అంశాలు వుండడంతో కాస్త భారీగానే ఖర్చవుతోంది. బహుశా ఈ నెలలోనే టీజర్ విడుదల వుంటుంది. 

 

Show comments