పుట్టిన రోజున.. హీరోయిన్ తోనే గడిపాడు!

మిలియన్ల కొద్దీ శుభాకాంక్షలు వచ్చి పడ్డాయి టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కొహ్లీకి. ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు, ఇండియాలోని విరాట్ ఫ్యాన్స్.. క్రికెట్ మాజీలు.. బాలీవుడ్… ఇలా పోటీలు పడి మరి సోషల్ మీడియా ద్వారా విరాట్ కు విభిన్నమై రీతుల్లో శుభాకాంక్షలు తెలిపారు. ఇరవై ఎనిమిదో పుట్టిన రోజుకు గానూ దేశంలో ఇంతలా విషెష్ పొందినది విరాట్ కొహ్లీ నేనేమో!

మరి ఈ క్రికెట్ స్టార్.. తన పుట్టిన రోజును ఎలా జరుపుకున్నాడు.. అని ఆరా తీస్తే.. విరాట్ ఈ పుట్టిన రోజును పూర్తిగా గర్ల్ ఫ్రెండ్ అనుష్కకు అంకితమిచ్చాడని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో తిరిగి బాహాటంగా తమ ప్రేమను చాటుకుంటున్న విరాట్- అనుష్కలు శనివారం రాజ్ కోట్ లో కనిపించారు.

ఈ నెల తొమ్మిది నుంచి ఇంగ్లండ్ తో ఇండియా ఈ వేదికనే తొలి టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో కొహ్లీ శనివారం అక్కడకు చేరుకున్నాడు. విరాట్ తోపాటు అనుష్క శర్మ ఉండటం విశేషం. ఈ చారిత్రాత్మక నగరంలో ఈ జంట విరాట్ పుట్టిన రోజు సందర్భంగా విహరించింది. ఇటీవల విరాట్- అనుష్కలు దీపావళి పండగను కూడా కలిసి జరుపుకున్నారు. పుట్టిన రోజును  కూడా ఇదే తరహాలో సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఇక క్రికెట్ స్టాండ్స్ లో అనుష్క కనిపిస్తుందేమో చూడాలి!

Show comments