90 డేస్ ఆఫ్ లవ్

ఇదేంటీ ఈ సినిమా అనుకోవద్దు..100 డేస్ ఆఫ్ లవ్ సినిమానే. మలయాళంలో దుల్కర్ సల్మాన్..నిత్య మీనన్ జంటగా చేసినా మూడు నాలుగు సినిమాల్లో ఇదే మొదటిది. తొలి సినిమాగా ఈ సినిమా ఓకె అనిపించుకుంది. పరభాషా చిత్రాలను తెలుగులోకి తెచ్చేటపుడు ఓ సౌలభ్యం వుంది. అందులో ఏమైనా చిన్నా పెద్దా మైనస్ లు వుంటే, సెట్ చేసుకోవచ్చు. 

100 డేస్ ఆఫ్ లవ్ సినిమాకు ఇప్పుడు ఇదే చేసారు. సినిమా అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అనిపించుకున్న దాన్ని నిర్మొహమాటంగా క్రాప్ చేసారట. దీంతో సినిమా ఇప్పుడు పెర్ ఫెక్ట్ గా మారిందట. అంటే 100 డేస్ ఆఫ్ లవ్ అన్న సినిమా కాస్తా కాస్త కట్ చేసుకంటే 90 డేస్ ఆఫ్ లవ్ అయినట్లే అనుకోవాలి.

నిత్య-దుల్కర్ కలిసి చేసిన మరో సినిమా జతగా ఈ సినిమా కన్నా ముందే డబ్ అయింది కానీ, ఇంకా విడుదల కాలేదు. ఈలోగా ఈ సినిమా వచ్చేస్తోంది. ఈనెల 29న విడుదలకు రెడీ అయిపోతోంది.

Show comments