ఒక్క షాట్ తో పడగొట్టేసాడు

మిరియం గింజలా చురుక్కు మనిపించే షాట్ ఒక్కటి వుంటే చాలు. కొన్ని సెకెండ్ల నిడివి అయినా టీజర్ అదిరిపోద్ది. అందుకే సత్తా వున్న సినిమాకు ట్రయిలర్ దాకా అక్కరలేదు. టీజర్ చాలు.

శేఖర్ కమ్ముల లాంటి డైరక్టర్ ఫిదా అంటూ మాంచి లవ్ స్టోరీ చెక్కుతున్నారు. జనం అంతా లేటవుతోంది.. లేటవుతోంది అని గొణుగుతూనే వున్నా, ఆయన చెక్కుడు ఆయన చేసుకుంటూ వస్తున్నారు. దాని ఫలితం ఇప్పుడు టీజర్ లో తెలిసింది.

ఓ అమెరికా అబ్బాయి.. ఓ తెలంగాణ అమ్మాయి.. ఇద్దరు ఒక్కటైన సీన్. అంతే టీజర్. కానీ అమ్మాయిని అబ్బాయి మంచుకొండల బ్యాక్ డ్రాప్ లో అలా ఒక్కసారి హత్తుకున్న స్టయిల్ సీన్ చాలు.

శేఖర్ కమ్ములలో తడి ఇంకా ఇంకిపోలేదని చెప్పడానికి. మణిరత్నం స్టయిల్ టేకింగ్ కనిపించింది. మొత్తం మీద ఫిదా టీజర్ జనాలను ఆకట్టుకునేటట్లే వుంది. Readmore!

Show comments

Related Stories :