డీజే క్లైమాక్స్.. నాకు సంబంధం లేదన్న హరీష్ శంకర్

ఈనెల 23న గ్రాండ్ గా విడుదలకానుంది డీజే సినిమా. ఈ మూవీ క్లైమాక్స్ కంప్లీట్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుందనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ఇప్పటికే చెప్పింది. ఇప్పుడా విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ కూడా స్పష్టంచేశాడు.

క్లైమాక్స్ లో ఫైట్ ఉండదని చెప్పేశాడు. పూర్తిగా ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని, ఇంకా చెప్పాలంటే డీజేకు కామెడీ క్లైమాక్స్ ఇచ్చామని అంటున్నాడు. ఇక్కడ కూడా బన్నీకే క్రెడిట్ ఇస్తున్నాడు.

“డీజే సినిమా క్లైమాక్స్ ను ఎంటర్ టైనింగ్ గా పెట్టాలనే కాన్సెప్ట్ బన్నీదే. ప్రీ-క్లైమాక్స్ లో మాత్రమే భారీ ఫైట్ ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం యాక్షన్ పార్ట్ లేకుండా పూర్తిగా ఎంటర్ టైనింగ్ గా మార్చేశాం.

ఇలా మార్చడానికి కారణం కేవలం బన్నీనే. తనిచ్చిన సలహాలతోనే డీజే సినిమా అద్భుతంగా తెరకెక్కింది. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది.” హరీష్ శంకర్ వెర్షన్ ఇది.

డీజేకు సంబంధించి ఇప్పటికే చాలా విషయాల్లో బన్నీ ప్రమేయం ఉందనే విషయాన్ని హరీష్ శంకర్ సుతిమెత్తగా చెప్పేశాడు. ఇప్పుడు క్లైమాక్స్ లో కూడా తన ప్రమేయం లేదని తప్పుకున్నాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ తేడాకొడితే నన్ను మాత్రం ప్రశ్నించొద్దు అన్నట్టున్నాయి హరీష్ శంకర్ మాటలు.

Show comments