కదుల్తారా..కాపు సెలబ్రిటీలు?

రెండు మూడు రోజుల క్రితం పార్క్ హయాత్ లో, ఆ తరువాత దాసరి ఇంట్లో, ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు బంగ్లాలో..ఇలా హైదరాబాద్ లోని కాపు సెల్రబిటీలు సమావేశాలు జరుపుకుంటూ వస్తున్నారు. అంతే కానీ ఈస్ట్ గోదావరికి వెళ్లి ముద్రగడకు మద్దతు తెలిపే కార్యక్రమం పెట్టుకోలేదు. బహుశా బాబు ప్రభుత్వం చేపడుతున్న పోలీసు చర్యల కారణంగా కావచ్చు. వెళ్తే ఏమవుతుంది. ఎయిర్ పోర్ట్ లోనో, హోటల్ లోనో నిర్భంధించి వెనక్కు పంపిస్తారు, అనే ఆలోచన కావచ్చు.

కానీ ఇలా భయపడితే..మరి బాబు ప్రభుత్వం పదే పదే అదే అస్త్రం ప్రయోగిస్తుంది కానీ మానదు కదా.. ఒకసారి ఆ అస్త్రానికి ఎదురు తిరగగలిగితే అప్పుడు. కామన్ మాన్, చోటా నాయకులు ఎదురు తిరగలేకపోవచ్చు.. కానీ ఈ కాపు సెలబ్రిటీలకు ఏమొచ్చె? వీళ్లంతా రాజమండ్రి వెళ్లారే అనుకుందాం.. ఏమవుతుంది.. యిర్ పోర్టులో అడ్డేస్తారు..అరెస్టు అంటారు..ముద్రగడను చూడ్డానికి వీల్లేదు అంటారు. 

అప్పుడు అక్కడే వాళ్లంతా సామూహిక నిరశనకు కూర్చుని పోతే..ముద్రగడను చూపించేవరకు ఆమరణ నిరశన అని ప్రకటిస్తే..అప్పుడు బాబు ప్రభుత్వం దిగిరాదా ? ఎప్పుడైతే కాపు సెలబ్రిటీలంతా దీక్షకు కూర్చున్నారో, అప్పుడు, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా లోని కాపుల్లో కచ్చితంగా చలనం వస్తుంది. పైగా చిరు, దాసరి లాంటి కాపు సెలబ్రిటీలు దీక్షకు కూర్చుంటే మీడియా మరి ఇక కర్టెన్లు కట్టడం మానేస్తుంది. జనాలకు ఆ న్యూస్ కావాలి కాబట్టి, ఇక అటే ఫోకస్ పెడుతుంది. ఎన్ని ఛానెళ్లను అని ఆపేస్తారు?

మరి ఈ దిశగా కాపు సెలబ్రిటీలు ఎందుకు ఆలోచించడం లేదు.. అంటే.. జవాబుగా ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది. ఈ రోజు, రేపు పరిస్థితిని చూసి ఇక ఈస్ట్ దిశగా కాపు సెలబ్రిటీలు కదలబోతున్నట్లు రాజకీయ వర్గాల బోగట్టా. ఎంతకాలమో ఇలా హైదరాబాద్ లో కూర్చుని స్టేట్ మెంట్ లు ఇవ్వడం సరికాదని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సో.. అదే జరిగితే, ఈస్ట్ లో సీన్ రసవత్తరంగా మారుతుంది.

Show comments