గెట్‌ రెడీ ఫర్‌ బికినీ షూట్‌.!

గెట్‌ రెడీ ఫర్‌ బికినీ షూట్‌.. అంటూ అభిమానుల్ని ఊరిస్తోంది ఓ బ్యూటీ. ఆమె ఎవరో కాదు, పవన్‌కళ్యాణ్‌తో 'కొమరం పులి' సినిమాలో హీరోయిన్‌గా నటించిన నికీషా పటేల్‌. తొలి సినిమాతోనే పవన్‌కళ్యాణ్‌ సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసిందిగానీ, ఆ సినిమా నిరాశపర్చడంతో నికీషా పటేల్‌కి అవకాశాలు తగ్గిపోయాయి. పైగా ఐరన్‌ లెగ్‌ స్టాంప్‌ కూడా పడిపోయింది. 

తెలుగులో ఆ తర్వాత ఒకటీ అరా సినిమాల్లో నటించిన నికీషా పటేల్‌ ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాలతో అలా అలా కెరీర్‌ని నెట్టుకొచ్చేస్తోంది. లేటెస్ట్‌గా ఈ బ్యూటీ, బికినీతో ఫొటో షూట్‌లో పాల్గొందట. ఆ షూట్‌ కోసం రెడీగా వుండమంటూ సోషల్‌ మీడియాలో అభిమానుల్ని ఊరించడం షురూ చేసేసింది. తమ అందచందాల్ని బికినీల్లోనో, అంతకన్నా హాట్‌ హాట్‌ డ్రస్సుల్లోనో చూపించడం, ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాకెక్కించి ఫాలోవర్స్‌ని పెంచుకోవడం.. ఇదంతా ఈ మధ్య హీరోయిన్లకి నయా ట్రెండ్‌గా మారిపోయింది. 

అన్నట్టు, బికినీ గ్లామర్‌ అంటే మాటలు కాదట. ఆ విషయం తెలిసే, బొద్దుగా వున్న తన గ్లామర్‌ని కాస్త స్లిమ్‌గా మార్చిందట. ఇందుకోసం నానా రకాల కసరత్తులూ చేసిందట. అఫ్‌కోర్స్‌.. ఆ వీడియోలతో గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో నికీషా సందడి చేస్తోందనుకోండి.. అది వేరే విషయం. మచ్చుకి ఓ బికినీస్టిల్‌.. అంటూ ఇదిగో, ఇలా పై ఫొటోని సోషల్‌ మీడియాలో వదిలింది నికీషా. ఇది శాంపిల్‌ మాత్రమే.. అసలు ఫొటో షూట్‌ కోసం వేచి చూడాల్సిందే.

Show comments