ఇంతకన్నా హోదా వుంటుందా?

హోదా అంటే ఏమిటి..స్టేటస్..నలుగురిలో గౌరవం. అలాంటి గౌరవం ఓ రేంజ్ లో దక్కింది మనకు. హ్యాట్సాఫ్ టు ఎపి మినిసర్లు. నిజమే కదా, పుత్రోత్సాహము అన్నట్లుగా మంత్రులోత్సాహము మనకు. మన మంత్రులు ఎంతవాళ్లయ్యారు. దేశంలోనే డబ్బులు బాగా వున్న మంత్రుల్లో 20 మంది మనదగ్గరే వున్నారట. అందులో అసలు మొత్తం దేశం మీద డబ్బున్న మంత్రి నారాయణ మన దగ్గరే వున్నారాయె. సరే, నారాయణ సంగతి అలా వుంచుదాం. ఇరవై మంది మంత్రులు మన దగ్గరే వున్నారు. అంటే ఏ రేంజ్ మంత్రి వర్గం మనది. 

ఎవడండీ బాబూ..జగన్ అంతా కార్పొరేట్ స్టయిల్, బిజినెస్ వ్యవహారం అనేది. ఇరవై  మంది మంత్రులు భారీ డబ్బున్న బాబులు మన చంద్రబాబు మంత్రులుగా వున్నారంటే, మరి ఎవరిది బిజినెస్ మైండ్ అనుకోవాలి. ఎవరిది కార్పొరేట్ స్టయిల్ అనుకోవాలి.

సరే, ఆ సంగతి అలా వుంచుందాం. దేశంలో ఇంతటి గౌరవాన్ని అదే హోదాను తెచ్చి  పెట్టిన మంత్రివర్గం మనది. మరే రాష్ట్రానికి లేదు ఇంతటి హోదా. మరి ఇలాంటి హోదా పెట్టుకుని ప్రత్యేక హోదా కావాలంటూ కేంద్రం ముందుకు వెళ్తుంటే ఏమని సమాధానం వినిపిస్తోంది. మిగిలిన రాష్ట్రాలు అడ్డం పడుతున్నాయి అని కదా. మరి అడ్డం పడవద్దని ఆ రాష్ట్రాలను అడిగితే అవేం అంటాయి. మాకు లేని డబ్బున్న మంత్రుల హోదా మీకు వుంది కదా? అని కౌంటర్ వేస్తాయేమో? అందువల్ల ముందుగా కొన్నాళ్లయినా ఈ డబ్బున్న మంత్రులను పక్కన పెడితే మంచిదేమో?

అవును...అన్నీ బాగానే వున్నాయి. కానీ, హెరిటేజ్ లాంటి భారీ కంపెనీ, ఇంకా డజన్ల కొద్దీ అనుబంధ కంపెనీలు చంద్రబాబు కుటుంబానికి  వుండగా, ఆయన కాకుండా, మిగిలిన మంత్రులు, నారాయణ రికార్డులకు ఎక్కారు ఏమిటీ? Readmore!

Show comments

Related Stories :