మంత్రి కొడుకు తాగి మళ్లీ ఆడవాళ్ల మీదకెళ్లాడు!

ఆ మధ్య బంజారా హిల్స్ లో తాగి ఒక వివాహిత స్త్రీని చెయి పట్టుకుని తన కారులోకి లాగే యత్నం చేసి, స్థానికుల చేతిలో తన్నులు తిన్నాడే.. ఆ మంత్రిగారి కొడుకు గుర్తున్నాడా! అన్ని తన్నులు తిన్నా.. ఇతగాడికి బుద్ధి వచ్చినట్టుగా లేదు. తను  ఏం చేసినా.. తండ్రి అధికారం తనను కాపాడుకొస్తుందనే గర్వం ఇతడిని మత్తును వదలనీయనట్టుగా ఉంది. ఇటీవల అతడే మళ్లీ గుంటూరులో మద్యం మత్తులో లేడీస్ హాస్టల్ లోకి చొచ్చుకుపోయే యత్నం చేసినట్టుగా తెలుస్తోంది. కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన.

గుంటూరు జిల్లాకు చెందిన  ఆ మంత్రి తనయుడి తాజా నిర్వాకాన్ని మెజారిటీ వర్గం మీడియా చూపడం లేదు. ఇతడు తన మిత్ర బృందంతో తప్ప తాగి..  గుంటూరులోని ఆర్వీఆర్ కాలేజీ దగ్గర ఉన్న లేడీస్ హాస్టల్ లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించాడు. మరి లోపలకు వెళ్లి సామూహిక అత్యాచారాలు చేద్దామని అనుకున్నాడో ఏమో కానీ.. ఇతడి నిర్వాకాన్ని గమనించి.. పక్కనే ఉన్న జెంట్స్ హాస్టల్ విద్యార్థులు రంగంలోకి దిగి అడ్డుకున్నారు. అంత మాత్రాన తగ్గుతాడా.. ఎంతైనా మంత్రి కొడుకు కదా.. జెంట్స్ హాస్టల్ విద్యార్థులపై కూడా ఇతడి మిత్ర బృందం దాడికి దిగింది. ఇక చేసేది లేక పోలీసులకు సమాచారం అందించారు. వారు రంగంలోకి దిగి.. మంత్రి గారి కొడుకు, అతడి మిత్రబృందాన్ని మందలించి పంపేశారని తెలుస్తోంది.

మరి ఎంత కండకావరముంటే.. ఇలాంటి పనులు చేస్తారు? తాగి ఏకంగా లేడీస్ హాస్టల్ మీదకు వెళ్లడం అంటే.. దీన్ని మత్తు అనాలా? అధికార మదం అనాలా? మరి ఇదేమైనా తొలిసారా అంటే అదీ కాదు! ఆల్రెడీ హైదరాబాద్ లో ఇలాంటి పని ఒకటి చేసి తన్నులు తిన్నాడు. అప్పుడేమో అదంతా జగన్ కుట్ర.. అన్నారు. ఆఖరికి కేసీఆర్ మంత్రి వర్గంలోని ఇతడి సామాజికవర్గానికి చెందిన ఒక మంత్రి కాళ్లు పట్టుకుని కేసు లేకుండా చూసుకున్నారు.  లేని కుక్కను అక్కడ సృష్టించి.. దాన్ని రక్షించడానికే మంత్రి  పుత్రరత్నం ప్రయత్నించాడు.. ఆ కుక్కను అక్కడ పెట్టి జగన్ కుట్ర చేశాడని వాదించారు. ఈ మంత్రిగారి కొడుకు దాష్టీకానికి తగు శిక్ష వేయలేక చట్టం కూడా మరోసారి తనపై నమ్మకాన్ని కోల్పోయింది. 

ఒకసారి అమ్మాయి చెయ్యిపట్టుకు లాగి.. సురక్షితంగా బయటపడ్డ వాడికి రెండోసారి భయమేమి ఉంటుంది? అందుకేఈ సారి లేడీస్ హాస్టల్ పై పడి సామూహిక అత్యాచార యత్నానికే పాల్పడినట్టుగా ఉన్నాడు. ఈ విషయం తెలిసీ.. పచ్చ మీడియా వర్గాలు దాచి ఉంచాయి. ఒకవేళ వెలుగులోకి తీసుకురాక తప్పని పరిస్థితే ఉంటే.. మంత్రి గారు రోడ్డు మీదకు ఎక్కి.. ఇదంతా జగన్ కుట్ర అని వాదించేవారనడంలో ఏమైనా సందేహం ఉందా? 

Show comments