జూలైలో సినిమాలే సినిమాలు

సమ్మర్ దాటిపోయింది..అయినా జూన్ నెలలో సినిమాలు బాగానే సందడి చేసాయి. అక్కడితో ఆగేలా లేదు ఈ సందడి..జూలై లో కూడా కొనసాగేలా వుంది. నిజానికి టాలీవుడ్ లో జూలై అంటే కాస్త వీక్ సీజన్. ఎందుకంటే వర్షాలు ఎక్కువగా వుంటాయి. అయినా కూడా ఈ జూలై మీద చాలా సినిమాలు ఆశలు పెట్టుకన్నట్లు కనిపిస్తోంది. మారుతి-దిల్ రాజు సంయుక్త నిర్మాణంలోని రోజులు మారాయి తో జూలై ఇన్నింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. 

సునీల్ ఆకెళ్ల వంళీ కాంబినేషన్ లోని జక్కన్న సినిమాను జూలై 15న విడుదల ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ రోజు రజనీ కాంత్ కబాలి వుంటుందని అంటున్నారు. అదే నిజమైతే జక్కన్నను కాస్త అటు ఇటు జరుపుతారు. ఇక మారుతి వెంకీ కాబినేషన్ లోని బాబు బంగారం కూడా జూలై ఆఖరివారంలో విడుదలవుతుంది. ఇక నాగ చైతన్య-గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో తయారైన సాహసం శ్వాసగా సాగిపో కూడా జూలైలోనే వుంటుందంటున్నారు.  

అంటే అయిదు సినిమాలు ఫిక్సయిపోయినట్లే. ఇవి కాక మరో రెండు మూడు సినిమాలు ఆలోచనలో వున్నాయి. ఇక మరీ చిన్న సినిమాల సంగతి సరేసరి. ఆగస్టులో ఎన్టీఆర్ సినిమా, ప్రేమమ్ సినిమా వున్నాయని వినరావడంతో, చాలా సినిమాలు జూలైలోనే షెడ్యూలు చేసుకుంటున్నాయి. దీంతో జూలై నెల కూడా సినిమాలతో సందడిగానే వుండేలా వుంది.

Show comments