బికినీ మూవీలో ప్రియాంక సీనెంత.?

’బేవాచ్‘ అంటే బికినీల పండగ.. అది ఓ టెలివిజన్ సిరీస్ ఒకప్పుడు. అదిప్పుడు సినిమాగా రాబోతోంది. 'బేవాచ్‌' హాలీవుడ్‌ మూవీలో బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటిస్తోన్న విషయం విదితమే. అయితే, ఈ సినిమాలో ఆమెది నెగెటివ్‌ రోల్‌. మామూలుగా అయితే, ఆమె రోల్‌కి ప్రమోషన్స్‌లోనూ ఫుల్‌ ఇంపార్టెన్స్‌ వుండాలి. కానీ, అది బాలీవుడ్‌ మూవీ కాదు కదా.! అందుకే, ప్రతిసారీ బేవాచ్‌ ప్రోమోస్‌లో ప్రియాంకా చోప్రాని పక్కన పడేస్తున్నారు. 

హాలీవుడ్‌ టీవీ సిరీస్‌ 'క్వాంటికో'తోపాటు హాలీవుడ్‌ మూవీ 'బేవాచ్‌' కోసం చాలా బాలీవుడ్‌ ఆఫర్లను ప్రియాంకా చోప్రా వదిలేసుకుంది. మరి, ఇంత త్యాగం చేసి ప్రియాంక సాధించిందేంటి.? అంటే, ప్చ్‌.. అప్పుడే చెప్పేయలేం.! ప్రియాంకా చోప్రా అయితే ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. అటు క్వాంటికో, ఇటు బేవాచ్‌ మూవీ తనకు హాలీవుడ్‌లో మంచి గుర్తింపుని తెచ్చిపెడ్తాయని అంటోంది. ఇప్పటికే క్వాంటికో సంచలనాలు సృష్టించేస్తోందని చెబుతోంది ప్రియాంక. 

ఇక, తాజాగా విడుదలైన 'బేవాచ్‌' ప్రోమోలో ప్రియాంకా చోప్రాని ఒకటి రెండు సెకెన్లపాటు కూడా పూర్తిగా చూపించలేదు. కానీ, ఆ కన్పించిన కాస్సేపట్లోనే సూపర్బ్‌ హాట్‌గా దర్శనమిచ్చింది. అఫ్‌కోర్స్‌ హాలీవుడ్‌లో ఇదేమీ అంత హాట్‌ కాదనుకోండి.. మన వరకూ మాత్రం పిగ్గీ చాప్స్‌ సూపర్‌ హాట్‌ అనుకోవాలి. ఇంతకీ, హాలీవుడ్‌ మూవీలో పిగ్గీ చాప్స్‌ సీనెంత.? సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.

Show comments