'మాల్దీవ్స్‌'లో హాట్‌ బ్యూటీస్‌.. మేటరేంటి.?

'వేలంవెర్రి' అన్న పదాన్ని ఇక్కడ కరెక్ట్‌గా ఉపయోగపడ్తుంది. బాలీవుడ్‌ బ్యూటీస్‌ అంతా ఇప్పుడు మాల్దీవ్స్‌ వైపు పరుగులు పెడ్తున్నారు. ఏ బ్యూటీ అయినాసరే, 'సెలవులొస్తే' మాల్దీవ్స్‌కి చెక్కేయడం, అక్కడి నుంచి హాట్‌ హాట్‌ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేయడం.. ఇదీ ఈ మధ్యకాలంలో స్పీడందుకున్న 'హాట్‌ ట్రెండ్‌'. ఫొటోలతోపాటు, వీడియోలూ పోస్ట్‌ చేస్తున్నారు. 

యంగ్‌ హీరోయిన్లు.. మిడిల్‌ ఏజ్డ్‌ హీరోయిన్లు.. వీళ్ళే కాదండోయ్‌, వయసు మీద పడ్డ ఒకప్పటి అందాల భామలూ మాల్దీవ్స్‌లో పిచ్చ పిచ్చగా ఎంజాయ్‌ చేసేస్తోంటే, 'అబ్బా.. మాల్దీవ్స్‌ ఏం అదృష్టం చేసుకున్నాయో..' అన్పించకమానదు. అసలింతకీ మాల్దీవ్స్‌లో ఏముంది.? ఇదే ఇప్పుడు ఎవరికీ అర్థం కావడంలేదు. మాల్దీవ్స్‌ ప్రపంచంలోనే పర్యాటక కేంద్రాలుగా గుర్తింపు పొందిన విషయం విదితమే. కానీ, అలాంటి అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో వున్నాయండోయ్‌.! 

ఎలాగైతేనేం, మాల్దీవ్స్‌ పేరుతో బాలీవుడ్‌ సినీ జనం తమ అభిమానుల్ని మేగ్జిమమ్‌ ఎంటర్‌టైన్‌ చేసేస్తున్నారు. మొన్న పూనమ్ పాండే, అంతకు ముందు కత్రినా కైఫ్, అంతకుముందు మందిరా బేడీ, మలైకా అరోరా, తాజాగా పూనమ్ పాండే, అలియా భట్.. ఈ తారల బికినీ గ్లామర్ మాల్దీవులకు కొత్త అందాల్ని తెచ్చిపెడ్తోందన్నది నిర్వివాదాంశం. ఆసక్తికరమైన విషయమేంటంటే, అక్కడికి వెళ్ళి వచ్చిన అందాల భామల్లో కొత్త గ్లామర్‌ కన్పిస్తోంది. అదంతా హ్యాపీనెస్‌ వల్ల వచ్చిందా.? లేదంటే ఇంకేదన్నా 'మిస్టరీ' వుందా.? ఏమో మరి, ఆ బ్యూటీస్‌కే తెలియాలి.

Show comments