సన్నీలియోన్‌ అదరగొట్టేసిందంతే

ఆమె గొప్ప డాన్సరేమీ కాదు.. కానీ, స్టేజ్‌ మీద అదరగొట్టేసింది. అసలు బాలీవుడ్‌లో ఆమెకు అంత సీన్‌ వుంటుందా.? అనుకున్నవాళ్ళే, ఇప్పుడామె బాలీవుడ్‌లో తనదైన స్టయిల్లో దూసుకుపోతోంటే షాక్‌ తినాల్సి వస్తోంది. పోర్న్‌ సినీ రంగంలోంచి సినిమాల్లోకొచ్చిన ఆమె పేరు సన్నీలియోన్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! ఇంతకీ, సన్నీలియోన్‌ తాజాగా ఏ స్టేజ్‌ మీద అదరగొట్టేసిందనే కదా మీ డౌట్‌.? 

'రోగ్‌' సినిమా ఆడియో విడుదల వేడుకలోనే సన్నీలియోన్‌ దుమ్ము రేపేసింది. అలా ఇలా కాదు, సూపర్బ్‌ ఎనర్జీతో సన్నీలియోన్‌ చేసిన డాన్సులు అందర్నీ షాక్‌కి గురిచేశాయి. 'సన్నీలియోన్‌, టాలీవుడ్‌ సినిమా ఫంక్షన్‌లో డాన్సులెయ్యడమేంటి.? ఇది నిజమేనా.?' అని కొందరు పెదవి విరిచారు కూడా. కానీ, ’రోగ్‘ టీమ్ ఆమెను రప్పించింది. ఇంకేముంది, సన్నీలియోన్‌ 'రోగ్‌' స్టేజ్‌ మీద డాన్స్ చేసేసింది.. చూసినవాళ్ళందరితోనూ అదరహో అన్పించేసుకుంది. ఆమె డాన్సులకన్నా, ఆమె ఎనర్జీ అందర్నీ ఎట్రాక్ట్ చేసిందనడం అతిశయోక్తి కాదేమో. 

బాలీవుడ్‌లో ఆమె నటించిన పలు సాంగ్స్‌ మెడ్లే రూపంలో ప్లే అయ్యయి.. వాటికి తగ్గట్టుగా హుషారుగా డాన్స్‌ చేసింది సన్నీలియోన్‌. చకచకా డ్రస్సులు మార్చేస్తూ, ఆ మెడ్లేలో వెళుతూ వస్తూ.. ఆమె కంప్లీట్‌ ఎనర్జీతో డాన్స్‌ చేసేస్తుంటే చూసినవాళ్ళంతా వావ్ అనకుండా వుండలేకపోయారు. 

తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన 'కరెంట్‌ తీగ' సినిమాలో నటించిన సన్నీలియోన్‌, తెరపై అంత ఈజ్ ప్రదర్శించలేకపోయింది. ఆమెనలా చూడ్డం కూడా కష్టంగానే అన్పించింది ప్రేక్షకులకి. సినిమా సినిమాకీ తనను తాను మార్చేసుకుంటోన్న సన్నీలియోన్‌, ఇప్పుడు మళ్ళీ తెలుగు తెరపై కన్పిస్తే.. గతంలో కన్నా చాలా బెటర్‌గా వుంటుందేమో.!

Show comments