పిక్‌ టాక్‌: ఆదాశర్మ ఆన్‌ 'టాప్‌'.!

టాలీవుడ్‌లో ’హార్ట్ ఎటాక్‘, ’సన్ ఆఫ్ సత్యమూర్తి‘, ’క్షణం‘ తదితర సినిమాలు చేసిన ఆదా శర్మ, హిందీలోనూ ఒకటీ అరా సినిమాలు చేసింది. ఆదా శర్మ తల్లి, షీలా శర్మకి సంప్రదాయ మల్లకంభ క్రీడలో విశేషమైన ప్రావీణ్యం వుంది. ఇప్పటికీ ఆమె మల్లకంభని ప్రాక్టీస్‌ చేస్తుంటుంది. ఆ విషయాన్ని మొన్నామధ్య ఓ వీడియో ద్వారా ఆదా శర్మ వెల్లడించింది కూడా. 

తల్లి బాటలోనే ఆదా శర్మ కూడా మల్లకంభని అప్పుడప్పుడూ ప్రాక్టీస్‌ చేస్తుంటుంది. ఇదిగో ఇలా, మల్లకంభ క్రీడలో తన ప్రావీణ్యాన్ని చాటుతూ 'విమెన్‌ ఆన్‌ టాప్‌' అంటూ సోషల్‌ మీడియాలో ఓ ఫొటో పోస్ట్‌ చేసింది. జిమ్నాస్టిక్స్‌కి సంబంధించి ఇదొక సంప్రదాయ వెర్షన్‌గా చెప్పుకోవచ్చేమో. నిజానికి భారతదేశంలో అనేక ప్రాచీన కళలే జిమ్నాస్టిక్స్‌కి మూలం.. అనే వాదనా లేకపోలేదు. 

మల్లకంభ అంటే చెక్కతో చేసిన స్తంభం ఆధారంగా చేసే వ్యాయామ క్రీడ. భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కన్పించే ఈ వ్యాయామ క్రీడ అత్యంత ప్రత్యేకమైనది. ఇక, సినిమాల సంగతెలా వున్నా, సోషల్‌ మీడియాలో ఇదిగో ఇలాంటి వింతలూ విడ్డూరాలతో ఎప్పటికప్పుడు అభిమానుల్ని అలరించడంలో మాత్రం ఆదా శర్మ ఎప్పుడూ 'టాప్‌' అనే చెప్పాలేమో.! 

Readmore!
Show comments