కాజల్‌ కళాపోషణ కెవ్వు కేక.!

'నేనే రాజు నేనే మంత్రి' సినిమాకి సంబంధించి కాజల్‌ అగర్వాల్‌ తొలిసారిగా సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ అప్పట్లో సెన్సేషన్‌ అయ్యింది. దానిక్కారణం, అందులో రాణా ఫొటో సరిగ్గా కన్పించకపోవడమే. 'కాజల్‌ అగర్వాల్‌ పెళ్ళి పీటలెక్కబోతోందేమో..' అనుకున్నారంతా ఆ ఫొటో చూసి. ఆ తర్వాతే అసలు విషయం అందరికీ తెలిసింది. అది సినిమాటిక్‌ స్టిల్‌ అని. 

లేటెస్ట్‌గా కాజల్‌ మరో స్టిల్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈసారీ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాకి సంబంధించినదే. షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తయ్యిందని పేర్కొంటూ, ఈ స్టిల్‌ని కాజల్‌ పోస్ట్‌ చేయడం గమనార్హం.

అప్పుడూ ఇప్పుడూ ఫొటోలు మాత్రం బీభత్సమైన క్రియేటివిటీతో వున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! క్రియేటివిటీ ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్‌దే అయినా, కళాత్మక కోణంలో ఆలోచించి వాటిని 'పిక్‌' చేయడంలో కాజల్‌ టాలెంట్‌నీ మెచ్చుకోవాల్సిందే.

దర్శకుడు తేజ, కాజల్‌ అగర్వాల్‌ని తెలుగు తెరకు 'లక్ష్మీకళ్యాణం' సినిమాతో పరిచయం చేశాడు. మళ్ళీ ఇన్నాళ్ళకు తేజ దర్శకత్వంలో కాజల్‌ అగర్వాల్‌ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో నటిస్తుండడం విశేషమే.

Readmore!

Show comments