రావు రమేష్. తండ్రికి తగ్గ వారసుడిగా ఎదుగుతున్న అచ్చ తెలుగు నటుడు. విలక్షణ పాత్రలను తనదైన స్టయిల్ లో పోషిస్తూ, ఆ క్రమంలో ఎదుగుతూ ముందుకువెళ్తున్నాడు.
గతంలో కన్నా ఇటీవల మాట మెల్ల మెల్లగా తండ్రి రావుగోపాలరావు మాదిరిగా మారుతోంది. దీనికి తోడు దువ్వాడ జగన్నాధమ్ సినిమా ట్రయిలర్ చూస్తే, రొయ్యల నాయుడు గుర్తుకు వచ్చాడు. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో లూజు నిక్కరు వేసుకుని, రొయ్యల మీసాలతో రావు గోపాలరావు విలక్షణ మైన పాత్ర పోషించాడు.
డిజెలో రావురమేష్ గెటప్ చూస్తే అచ్చం అలాగే వుంది. కాస్త ఒళ్లు చేసినట్లు గెటప్, మాట, మీసం అన్నీ నాన్న రావుగోపాల రావు మాదిరిగా తయారైపోయాడు రావు రమేష్.
ఈ గెటప్ బాగానే సూటయినట్లుంది కూడా. అంటే ఇక భవిష్యత్ లో రావు గోపాలరావు వేసిన అనేకానేక గెటప్ లను రావురమేష్ ఒక్కోటీ ట్రయ్ చేస్తాడేమో?