రోహిత్ సినిమాలో మోహన్ బాబు?

కథలో రాజకుమారి..నారా రోహిత్ లేటెస్ట్ సినిమా. ఈ సినిమాలో కథకు అనుగుణంగా కొంతవరకు సినిమా రంగం నేపథ్యం వుంటుంది. దాని కోసం మంచులక్ష్మి, నాగశౌర్య, ఆదాశర్మ వంటివాళ్లు నారా రోహిత్ కోసం ఫ్రెండ్లీ అప్పీరియన్స్ ఇవ్వడానికి ఓకె అన్నారు. 

ఇప్పుడు మరో టాప్ స్టార్ ను కూడా ఈ సినిమాలో కనిపించేలా చేయడానికి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ టాప్ స్టార్ ఎవరో కాదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. సినిమాలో చిన్న కీలకపాత్ర వుందట. దానికి మోహన్ బాబు అయితే బాగుంటుందని, పైగా సినిమాకు మాంచి అడ్వాంటేజ్ అవుతుందని యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఇంకా మోహన్ బాబును అప్రోచ్ కాలేదట. రోహిత్ కోసం ప్రెండ్లీ అప్పీరియన్స్ ఇస్తున్న మంచు లక్ష్మి ద్వారా అప్రోచ్ కావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే ఫిక్స్ అయితే, నాగశౌర్య, ఆదా శర్మ, మంచులక్ష్మి, మోహన్ బాబు లాంటి స్టార్ అట్రాక్షన్ తోడయితే సినిమా కు బజ్ ఓ రేంజ్ లో వస్తుంది. 

Show comments