ఎన్టీఆర్ రంజాన్ సెంటిమెంట్

ప్రస్తుతం జై లవకుశ అనే సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. బాబి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. సెప్టెంబర్ లో మూవీని థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్. ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను రంజాన్ కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 23న శుక్రవారం రోజు జై లవకుశ టీజర్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

జనతా గ్యారేజ్ కు రంజాన్ కు కనెక్షన్ ఉంది. లాస్ట్ ఇయర్ రంజాన్ కానుకగా జనతా గ్యారేజ్ టీజర్ ను విడుదల చేశారు.  తర్వాత ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సెంటిమెంట్ తో ఈ ఏడాది కూడా రంజాన్ టైమ్ కు తన కొత్త సినిమా టీజర్ ను విడుదల చేయాలని అనుకుంటున్నాడట ఎన్టీఆర్.

రీసెంట్ గా జై లవకుశ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. సినిమాలో విలన్ గా కనిపించనున్న జై క్యారెక్టర్ ను ఫస్ట్ లుక్ కింద విడుదల చేశారు. ఇప్పుడు టీజర్ కోసం కూడా జై క్యారెక్టర్ నే సెలక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్రకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ బూత్ బంగ్లా, జైలు సెట్ లో కొన్ని సన్నివేశాలు పిక్చరైజ్ చేశారు.

జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ 3 గెటప్స్ లో కనిపిస్తాడనే విషయం తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. రాశిఖన్నా, నివేదా ధామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నందిత ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

Show comments