జేసీ అహంపై దారుణమైన దెబ్బ..!

విమానాశ్రయంలో చేసిన రాద్ధాంతంపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని చెప్పిన తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఒక విమానయాన సంస్థ ఝలక్ ఇచ్చింది. వైజాగ్ ఎయిర్ పోర్టులో రచ్చ రచ్చ చేసి.. ఆపై కూడా ఎదురుదాడితో రుబాబు చేస్తున్న దివాకర్ రెడ్డికి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో దివాకర్ రెడ్డిని విమానం ఎక్కనీయలేదు ఒక విమానయాన సంస్థ. దివాకర్ రెడ్డి పై ప్రయాణ నిషేధం విధించిన ట్రూజెట్ ఎయిర్ లైన్స్ దాన్ని అమల్లోనే ఉంచింది. వైజాగ్ ఎయిర్ పోర్టులో చేసిన రాద్ధాంతంపై క్షమాపణలు చెప్పని దివాకర్ రెడ్డి తమ విమానంలో ఎక్కడానికి వీల్లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. 

హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో రావాలని ప్రయత్నించిన దివాకర్ రెడ్డికి అది సాధ్య పడలేదు. వైజాగ్ ఎయిర్ పోర్టులో రచ్చ అనంతరం ఒక అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ లో ప్రపంచాన్ని చుట్టేసి వచ్చాడు దివాకర్ రెడ్డి. మరి దివాకర్ రెడ్డిపై డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ సంస్థలు నిషేధం విధించిన సంగతి తెలియక విదేశానికి వెళ్లే అవకాశం ఇచ్చినట్టుంది ఆ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్.

అయితే దేశీయంగా మాత్రం దివాకర్ రెడ్డి కి విమానయాన సంస్థలు చుక్కలు చూపుతున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి దివాకర్ రెడ్డి వెనుదిరిగాడు. ఇది జేసీ అహంపై భారీ దెబ్బే అనుకోవాలి. చేసిన రుబాబుకు క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేసిన దివాకర్ రెడ్డికి పై విమానయాన సంస్థలు కూడా అంతే స్థాయి ఎదురుదాడి చేస్తున్నాయి. Readmore!

క్షమాపణలు చెప్పకపోతే.. విమానం ఎక్కనిచ్చేది లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో దివాకర్ రెడ్డికి విమానాశ్రయం నుంచి నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. మరి ఇప్పుడే ఈ విషయం రసకందాయకంలో పడింది.. ఇక నుంచి దివాకర్ రెడ్డి ఎలా స్పందిస్తాడో..!

Show comments

Related Stories :