సితార.. 'స్పైడర్‌' సెట్‌లో మాత్రమేనా.?

ఫొటోలో చూస్తున్నారు కదా.. 'స్పైడర్‌' సెట్‌లో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కుమార్తె సితార సందడి.! మహేష్‌బాబుతోనూ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తోనూ సీతార ఫొటోలకు పోజులిచ్చేసింది. సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ ఈ ఫొటోల్ని క్లిక్‌ మనిపించేశారు. కొన్ని ఫొటోల్ని సంతోష్‌ శివన్‌ సోషల్‌ మీడియాలో పెడితే, సితారతో తాను దిగిన ఫొటోని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 

అన్నట్టు, మహేష్‌ హీరోగా తెరకెక్కిన '1 నేనొక్కడినే' సినిమాలో మహేష్‌ తనయుడు గౌతమ్‌ కన్పించిన విషయం విదితమే. చిన్నప్పటి మహేష్‌లా గౌతమ్‌తో నటింపజేశాడు '1 నేనొక్కడినే' చిత్ర దర్శకుడు సుకుమార్‌. మహేష్‌ కంటే కూడా గౌతమ్‌ సెట్స్‌లో ఎనర్జీతో కన్పించేవాడంటూ అప్పట్లో గౌతమ్‌ని ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు సుకుమార్‌. 

ఇప్పుడేమో, కుమార్తె 'సితార'ని సెట్‌లోకి తీసుకెళ్ళాడు మహేష్‌. కేవలం సెట్‌లోకి మాత్రమే సితారని తీసుకెళ్ళాడా.? 'స్పైడర్‌' సినిమాలోకీ సితారని మహేష్‌ తీసుకొచ్చాడనుకోవాలా.? ఏమోగానీ, రకుల్‌ మాత్రం 'సో ఎక్స్‌ప్రెసివ్‌..' అంటూ సితారతో తాను దిగిన ఫొటోని షేర్‌ చేయడంతో 'స్పైడర్‌' సినిమాలో సితార నటించిందన్న సరికొత్త ఊహాగానాలకు ఆస్కారమేర్పడింది.

Show comments