ఆక్సిజన్ సమస్యలు తీరలేదా?

గోపీచంద్-జ్యోతి కృష్ణ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఆక్సిజన్. ఈ సినిమా ఓ అడుగు ముందుకు, ఓ అడుగు వెనక్కు వేస్తోంది. ఆ మధ్య వచ్చిన అవుట్ పుట్ తో హీరో శాటిస్ ఫై కాలేదని వార్తలు వినిపించాయి. దాన్ని ఏదో విధంగా అధిగమించి ముందుకు వెళ్తున్నారు. సెప్టెంబర్ 30 డేట్ కూడా ఇచ్చారు. కానీ ఆ డేట్ కు వచ్చే అవకాశాలు అంతగా లేవని తెలుస్తోంది. 

ఈ సినిమా షూట్ బ్యాలెన్స్ వుండగానే హీరో గోపీచంద్ మరో సినిమాకు క్లాప్ కొట్టించేసాడు. సంపత్ నంది డైరక్టర్ దానికి. ఈ సినిమా వల్ల ఇప్పుడు ఆక్సిజన్ సినిమా బ్యాలెన్స్ వర్క్ కు ఇబ్బందులు వస్తున్నాయని తెలుస్తోంది.  కొత్త సినిమాలో గెటప్ కోసం గోపీ చంద్ గెడ్డం పెంచాల్సి వుందట. అలా గెడ్డం పెంచి, నెల రోజులు ఫారిన్ లో షెడ్యూలు చేయాల్సి వుందట. 

మరి గెడ్డం పెంచి, ఫారిన్ వెళ్తే, ఆక్సిజన్ కు బ్యాలెన్స్ వుండిపోయిన చిన్న చితకా పనులు సంగతేమిటో మరి? అక్కడి నుంచిన తరువాత గెడ్డం తీసి ఫినిష్ చేస్తారా? లేక ముందే కరుణిస్తారా అన్నది అనుమానంగా వుంది. 15 నుంచి ఆ సినిమా మీదకు వెళ్తారు. ఈలోగా ఇది ఫినిష్ చేస్తే ఓకె. లేదంటే, ఇక నవంబర్ కే వెళ్లాల్సి వుంటుంది.

Show comments