వర్మ సెటైర్లే సెటైర్లు

చిరంజీవి 150వ సినిమాను దర్శకుడు వర్మ వదలడు గాక వదలడు. ఇది క్లియర్. సంక్రాంతికి సినిమా విడుదలయ్యాక ఏం అంటాడో కానీ, ఇప్పుడైతే మాత్రం మాటల తూటాలు పేలుస్తూనే వున్నాడు. చిరంజీవి పే..ద్ద కత్తి పట్టుకున్న స్టిల్ ఒకటి జోడించి, ట్వీట్ల మీద ట్వీట్లువదిలాడు. ఈ డిజైనర్ కు, డైరక్టర్ కు పాదాభివందనం, అని, మేడమ్ టస్సాడ్ మ్యూజియమ్ సగం రాసిచ్చేయచ్చని, ఇలా ఏదోదే, ఆయనకు తోచినవి చకచకా వదిలేసాడు. నిజానికి వర్మకు ఈ చాన్స్ ఇస్తున్నది కూడా మెగా క్యాంప్ అనే అనకోవాలి. ఎందుకంటే, చిరు చేతిలో ఆ పే..ద్ద కత్తి చాలా ఆడ్ గా వుందన్నది వాస్తవం. ఇప్పటి దాకా యంగ్ చిరంజీవిని మాత్రమే చూపిస్తూ, పాటలు, డ్యాన్స్ ల మీదనే కాన్సన్ ట్రేట్ చేసిన మెగా క్యాంప్ తొలిసారి కథలో ఓ పాయింట్ ను లేదా జోనర్ ను చెప్పే ప్రయత్నం ఈ స్టిల్ ద్వారా చేసింది. అలా చేసిన తొలి ప్రయత్నమే వర్మ ట్వీట్ ల దాడికి గురయింది. 

ఈ ట్వీట్లు సినిమా విడుదలయ్యే దాకా కొనసాగుతాయన్నది వాస్తవం. మరో కొద్ది రోజుల్లో ట్రయిలర్ వచ్చాక, చిరు స్పీచ్ విన్నాక మరి ఎలాంటి ట్వీట్లు వదుల్తాడో వర్మ..కాస్త ఆసక్తి కరమే. 

 

Readmore!
Show comments