మూడేళ్ల నిరీక్షణ ఫలిస్తున్న రోజు

నారా లోకేష్ బాబు అధికార రాజకీయాల్లోకి వచ్చేసినట్లే. మూడేళ్లుగా అదిగో ఇదిగో అని వినిపిస్తున్న వార్తలే తప్ప, ఆచరణ కనిపించలేదు. ఆఖరికి సార్వత్రిక ఎన్నికలు మరో రెండేళ్ల దూరం వుండగా లోకేష్ బాబు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కాబోతున్నారు. అందుకోసం ఈ ఉదయం వెలగపూడిలో నామినేషన్ వేసే హడావుడి షురూ అయింది.

కేటిఆర్ మంత్రిగా పేరు తెచ్చుకుంటున్న కొద్దీ లోకేష్ ను కూడా మంత్రిని చేయాలని తెలుగుదేశం వర్గాల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రెజర్ పెరిగింది. కానీ టైమ్ కోసం చూసి చూసి ఇప్పటికి నిర్ణయం తీసుకున్నారు. అది కూడా పార్టీలో అసంతృప్తి ప్రబల కుండా, ఎవరైతే అసంతృప్తితో వున్నారో వారిని ఎమ్మెల్సీలను చేస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం అన్నది బాబు చాణక్యానికి అద్దం పడుతుంది. 

ఎక్కడెక్కడతే వైకాపా జనాలు పార్టీలోకి వచ్చారో, వారి వల్ల ఎక్కడయితే తమకు సమస్య వస్తుందని స్థానికంగా వున్న పెద్ద లీడర్లు భయపడుతున్నారో, వాళ్లని ఇప్పుడు ఎమ్మెల్సీలను చేసారు. దీంతో రెండు పిట్టలు పడగొట్టినట్లయింది. వాళ్ల భయం పోయింది. ఇక అసంతృప్తి వుండదు. పైగా వైకాపా నుంచి వచ్చిన జనాలకు లైన్ క్లియర్. పనిలో పని లోకేష్ కు ఎమ్మెల్సీ. 

మొత్తం మీద మొదటి అంకం సులభంగా ముగిసినట్లే. మంత్రి వర్గంలో లోకేష్ కాలు పెట్టడంతోనే రెండో అంకం ముగుస్తుంది.

 

Show comments