యంగ్ టైగర్ ఎన్టీఆర్ ది కాస్త హెవీ పర్సనాలిటీ. అయితే యమదొంగ సినిమాతో కరెంట్ తీగలా మారిపోయాడు. టెంపర్ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించాడు. కానీ మళ్లీ జనతా గ్యారేజ్ లో కాస్త ఫ్యాటీగానే వున్నాడు. ఇప్పుడు జయ్ లవ కుశ చేయాల్సిన టైమ్ వచ్చింది. 15 నుంచి సెట్ మీదకు వెళ్లబోతున్నాడు.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా పది కిలోల బరువు తగ్గాడట. ఈ మధ్య దొరికిన గ్యాప్ లో బరువు తగ్గించడం, జుట్టు పెంచడం అనే రెండు పనులు దిగ్విజయంగా నెరవేర్చాడట ఎన్టీఆర్. ఇప్పుడు మళ్లీ టెంపర్ లో మాదరిగా మాంచి ఫిజిక్ తో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్.
జుట్టు పెంచడం ఎందుకయ్యా అంటే, ఈ సినిమాలో మూడు గెటప్ లు. అందువల్ల హెయిర్ ఎక్కువ వుంటే, స్టయిల్ ను బట్టి అటుఇటు మార్చుకోవచ్చన్న అయిడియాతో ఇలా జుట్టుపెంచాడట. ఇవీ బాబీ-ఎన్టీఆర్ సినిమా అప్ డేట్స్.