'బాహుబలి'.. బాబోయ్‌ ఇదేం 'బ్రాండ్‌'.!

ఓ తెలుగు సినిమాని హిందీలోకి డబ్‌ చేసి, అక్కడ స్ట్రెయిట్‌ సినిమాలకి ధీటుగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయడమేంటి.? ఇది కలలో కూడా ఎవరూ ఊహించని విషయమే. పోనీ, ఆ స్థాయిలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తెలుగు సినిమా అక్కడ విడుదలువుతందని, అవ్వాలని కొందరైనా ఆశించి వుంటారు. అయితే, ఓ సినిమా పేరుతో వివిధ ప్రోడక్ట్స్‌ తమ ప్రచార కార్యక్రమాల్ని నిర్వహిస్తాయని ఎవరైనా అనుకున్నారా.? ఛాన్సే లేదు. 

ఓ ఛానల్‌లో హిందీ సినిమా ఒకటొస్తోంది.. మధ్యలో యాడ్స్‌, వాటిల్లో చాలావరకు 'బాహుబలి' బ్రాండ్‌తో వచ్చినవే. టాట్టూ దగ్గర్నుంచి, పెయింట్‌ వరకూ.. అలా అలా 'బాహుబలి' పేరుతో యాడ్స్‌ వచ్చేస్తోంటే, ఆ సినిమా చూసిన తెలుగు సినీ అభిమానులు తియ్యటి షాక్‌కి గురయ్యారు. కేవలం సినిమా కోసం చేసిన పబ్లిసిటీతోనే ఈ స్థాయిలో 'బాహుబలి' మేనియా నడవడంలేదు. అంతకు మించి, 'బాహుబలి' కోసం చాలా చాలా కష్టపడ్డాడు దర్శకుడు రాజమౌళి. దానికి ఫలితమే.. ఇప్పుడీ విజయం. 

'బాహుబలి' సినిమా సాధించిన వసూళ్ళకితోడు ఈ 'బ్రాండింగ్‌'నీ లెక్కల్లోకి తీసుకుంటే, 'బాహుబలి'ని డైనోసార్‌గానే కాదు, అంతకు మించి.. అని అనకుండా వుండలేం. ఐదొందల కోట్లు, వెయ్యి కోట్లు.. ఈ లెక్కలు కాదు, 'బాహుబలి' ఇట్స్‌ ఎ బ్రాండ్‌. ఇండియన్‌ సినిమాకే 'బ్రాండ్‌'గా మారిపోయిందిప్పుడు 'బాహుబలి'. ఇది అతిశయోక్తి అని ఎంతమాత్రం అనుకోవడానికి వీల్లేదు. ఇది నిఖార్సయిన వాస్తవం.

Show comments